ఇక రామోజీ… ఓటీటీ!

ట్రెండ్ బ‌ట్టి కొత్త వ్యాపారం మొద‌లెట్ట‌డం రామోజీరావు స్టైల్‌. ఇప్పుడాయ‌న దృష్టి ఓటీటీపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. సినిమా రంగంలో ఓటీటీ న‌యా బిజినెస్ మోడ‌ల్ అయి కూర్చుంది. అందుకే బ‌డా నిర్మాత‌లంతా ఓటీటీపై క‌న్నేశారు. రామోజీ కూడా ఓటీటీ వ్యాపారం మొద‌లెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. దానికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ కూడా మొద‌లైపోయింది.

ఉషా కిర‌ణ్ మూవీస్ నిర్మించిన దాదాపు 80 సినిమాలు ఈటీవీ దగ్గ‌ర ఉన్నాయి. ఇవి ఈటీవీలో ప్ర‌సారం అయిన‌ప్పుడు చూడాలి త‌ప్ప‌, బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌వు. క‌నీసం యూ ట్యూబ్‌లో కూడా ఉండ‌వు. అవి కాకుండా.. కేవ‌లం ఈటీవీ దగ్గ‌రే ఉన్న సినిమాలు వంద‌ల కొద్దీ ఉన్నాయి. ఈటీవీ ప్రారంభ‌మైన‌ప్పుడు 99 ఏళ్ల‌కు లీజుకు తీసుకున్న సినిమాల‌వి. అప్పుడు శాటిలైట్ హ‌క్కుల‌పై అంత అవ‌గాహ‌న, వాటికి అంత డిమాండ్ లేక‌పోవ‌డంతో ఈటీవీ చాలా చీప్ గా కొనేసింది. ఇవ‌న్నీ ఓటీటీకి అద‌న‌పు బ‌లాలు. ఈటీవీ ద‌గ్గ‌ర ఉన్న సినిమాలు, ఈటీవీ ఇది వ‌ర‌కే కొనుక్కున్న సినిమాలు ఓటీటీకి బ్యాంక్ గా ప‌నికొస్తాయి. ఉషాకిర‌ణ్ మూవీస్ పై సినిమాలు తీసి, వాటిని ఓటీటీలో విడుద‌ల చేసుకోవ‌డం మ‌రో ఆప్ష‌న్‌. అంద‌రిలానే.. చిన్నా, పెద్ద సినిమాల్ని మంచిరేటుకి కొనుగోలు చేసి, ముందు ఓటీటీలోనూ, ఆ త‌ర‌వాత‌.. ఈటీవీలోనూ ప్ర‌సారం చేసుకోవొచ్చు. రామోజీ ఏం చేసినా భారీగా ఉంటుంది. అందుకే దాదాపు వంద సినిమాల వ‌ర‌కూ కొనుగోలు చేసి, ఆ త‌ర‌వాత‌… ఏటీటీని లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. ఈటీవీ కూడా ఓటీటీలోకి దిగితే.. ఈ రంగంలో మంచి పోటీ ఏర్ప‌డ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close