మీడియా వాచ్‌: సాహిత్య ‘సేవ‌’ ఆపేసిన‌ రామోజీ

ప్రింట్ మీడియా ఇప్పుడు దీన స్థితిలో ఉంది. దిన ప‌త్రిక‌ల ప‌రిస్థితే… దిన దిన గండం – నూరేళ్ల ఆయుష్షు అన్న‌ట్టు త‌యారైంది. సాహిత్య ప‌త్రిక‌ల సంగ‌తి ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. నామ్ కే వాస్తే – ఉంటున్నాయంతే. బ‌ల‌మైన అండ దండ‌లున్న ప‌త్రికలే వ‌రుస‌గా మూత‌ప‌డుతున్నాయి. ఇప్పుడు రామోజీ ఫౌండేష‌న్ నుంచి వ‌చ్చే తెలుగు వెలుగు, బాల భార‌తం, విపుల, చ‌తుర కూడా శాశ్వ‌తంగా సెల‌వు తీసుకున్నాయి.

ద‌శాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్న ప‌త్రిక‌లు విపుల – చ‌తుర‌. విపుల ఓ విశ్వ క‌థ‌ల ప్ర‌పంచం. చ‌తుర‌ల‌లో న‌వ‌వ‌లు వ‌స్తుంటాయి. త‌క్కువ ధ‌ర‌కు ఈ ప‌త్రిక‌లు ల‌భిస్తుండ‌డంతో.. సాహితీప్రియులు మొగ్గు చూపించారు. చ‌తుర‌లో వ‌చ్చే న‌వ‌ల‌లు కొన్ని సినిమాలుగానూ వ‌చ్చాయి. ప‌దేళ్ల క్రితం.. తెలుగు వెలుగు ప్రారంభ‌మైంది. రామోజీ రావుకి చాలా ఇష్ట‌మైన ప‌త్రిక ఇది. ఈ పత్రిక‌ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించారు. క‌ల‌ర్‌ప్రింటు, మంచి పేప‌రు.. తో నాణ్యమైన ప‌త్రిక‌గా తీర్చిదిద్దారు. ప్రింటు ఖ‌ర్చు పెరిగిపోతున్నా – ఈ ప‌త్రిక 20 రూపాయ‌ల‌కే ల‌భించేది. ఆ త‌ర‌వాత బాల భార‌తం వ‌చ్చింది.చిన్న పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌త్రిక ఇది. వీటికి ఆద‌ర‌ణ అంతంత‌మాత్రంగా ఉండ‌డం, నిర్వ‌హ‌ణ వ్య‌యం మించిపోవ‌డం, కోవిడ్ ప‌రిస్థితులు.. వీటి దృష్టిలో ఉంచుకుని 2020 జూన్ నుంచి ప్రింటింగ్ ఆపేశారు.కేవ‌లం ఆన్ లైన్‌లో మాత్ర‌మే ప‌త్రిక ల‌భించేది. ఇప్పుడు ఆన్ లైన్‌ని కూడా మూసేశారు. ఈ నాలుగు ప‌త్రిక‌లూ ఇక రావంటూ…యాజ‌మాన్యం ఓ కీల‌కమైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దాంతో.. సాహితీ అభిమానులు విచారంలో ప‌డిపోయారు.

తెలుగు వెలుగుపై రామోజీరావుకి ప్ర‌త్యేక‌మైన ఇష్టం. ప‌త్రిక ముందు నుంచీ న‌ష్టాల్లో ఉన్నా స‌రే, కేవ‌లం భాష‌పై మ‌మ‌కారంతో ఈ ప‌త్రిక‌ని న‌డిపారు. దాన్ని సైతం.. మూసేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. రామోజీ సంస్థ‌లకు ఓ గ‌ట్టి నియ‌మం ఉంది. ఏ సంస్థ న‌ష్టాల్లో ఉన్నా – ఉపేక్షించ‌రు. `సితార‌` న‌ష్టాల బాట ప‌ట్టిన వెంట‌నే, క‌నీసం ముంద‌స్తు ప్ర‌క‌ట‌న కూడా లేకుండా మూసేశారు. ఈ నాలుగూ సాహితీ ప‌త్రిక‌లు కాబ‌ట్టి, నెల‌స‌రి చందాదారులు ఉంటారు కాబ‌ట్టి, ముందుగా ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చారేమో.

ఈనాడు దిన ప‌త్రిక భారీ లాభాల్లో ఉన్న‌ప్పుడు – ఆయా ప‌త్రిక‌ల నిర్వ‌హ‌ణ అంత క‌ష్ట‌మ‌నిపించేది కాదు. కానీ ఇప్పుడు ఈనాడు కూడా న‌ష్టాల్లో న‌డుస్తోంది. ప్ర‌క‌ట‌న‌లు బాగా త‌గ్గిపోయాయి. దాంతో… మిగిలిన ఖ‌ర్చుల్ని ఎలా త‌గ్గించుకోవాలా? అనే ఆలోచ‌న‌లో ప‌డింది యాజ‌మాన్యం. అందులో భాగంగా ఉద్యోగుల్ని తొల‌గించారు. జీతాలు క‌ట్ చేశారు. ఇప్పుడు.. ఏకంగా నాలుగు సాహితీ సంస్థ‌ల్నే మూసేశారు. రామోజీ రావు లాంటి వ్య‌క్తే సాహితీ సేవ మేం చేయ‌లేం.. అంటూ దండం పెట్టేశాడంటే, మిగిలిన‌వాళ్ల మాటేంటి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close