రెడ్ టీజ‌ర్‌: రేసీ థ్రిల్ల‌ర్‌

ఈమ‌ధ్య థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి మాంచి గిరాకీ ఏర్ప‌డింది. ఇది వ‌ర‌కు చిన్న హీరోలు, కొత్త హీరోలే ఇలాంటి క‌థ‌లు ఎంచుకునేవారు. ఇప్పుడు ఓ స్థాయి ఉన్న హీరోలూ.. చేసేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఓ సూప‌ర్ హిట్ అందుకున్న రామ్‌… తొలిసారి థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకున్నాడు. అదే రెడ్‌. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. టీజ‌ర్ విడుద‌లైంది.

రామ్ ఇందులో రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఒకేలా ఉండే ఇద్ద‌రి.. (ఆదిత్య‌, సిద్దార్థ‌) మ‌ధ్య ఉన్న సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ నేప‌థ్యంలో సాగ‌బోతోందీ చిత్రం. ఎవ‌రు ఎవ‌రిని ఎందుకు ఇరికించాల‌ని చూశాడ‌న్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి. టీజ‌ర్‌లో చూపించిన షాట్లు, ఆర్‌.ఆర్‌, విజువ‌ల్స్‌… ఇవ‌న్నీ ఈ సినిమాపై న‌మ్మ‌కాన్ని పెంచుతున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలోని గెట‌ప్‌లోనే రామ్ క‌నిపిస్తున్నా.. రెండు పాత్ర‌ల మ‌ధ్య వైవిధ్య స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. నివేదా పేతురాజ్ పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టిస్తోంది. ఆదిత్య‌, సిద్దార్థ్‌కీ నివేదా పాత్ర‌కీ ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. మొత్తానికి రెడ్ టీజ‌ర్‌… రేసీ థ్రిల్ల‌ర్‌ని చూడ‌బోతున్నామ‌న్న న‌మ్మ‌కం క‌లిగించింది. ఫైన‌ల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close