తేజూ సినిమాలో శివ‌గామి

సాయిధ‌ర‌మ్ తేజ్ – దేవాక‌ట్టా కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. నివేదా పేతురాజ్ క‌థానాయిక‌గా ఎంపికైంది. ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. రాజ‌కీయ రంగంలో ఎత్తులూ, పై ఎత్తులూ, వెన్నుపోట్లూ… ఈ క‌థ‌లో కీల‌క‌మైన అంశాలు. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌ని ఎంచుకున్నారు. ఆమె ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఓర‌కంగా విల‌న్ పాత్రే అనుకోవాలి. ఆ పాత్ర‌లో నెగిటీవ్ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్థానం కూడా పొలిటిక‌ల్ థ్రిల్ల‌రే. కానీ.. అందులో ఎమోష‌న్స్‌ని బాగా మిక్స్ చేశాడు దేవాక‌ట్టా. ఈసారీ అదే పంథాలో ఈ క‌థ‌ని రాసుకున్నాడ‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ హంగులు సైతం ఎక్క‌డక‌క్క‌డ వాటిని హైలెట్ చేస్తూ, ఈ సినిమాని ఓ క‌మ‌ర్షియ‌ల్ పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌ల‌చ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. లాక్ డౌన్ ముగిశాక‌.. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎల్జీ పాలిమర్స్.. అయినా నో రిలీఫ్..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ .. ఎక్కడైనా రిలీఫ్ దొరుకుతుందేమోనని.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పటికిప్పుడు సంస్థను సీజ్ చేయడం ప్రమాదకరం...

ఫ్లాష్ బ్యాక్‌: ఒకే సినిమా.. ఒకేరోజు.. రెండు ప్రారంభోత్స‌వాలు

సినిమా ప్రారంభోత్స‌వం అంటే.. ఓ పండ‌గ‌లాంటిదే. మంచి ముహూర్తం చూసుకుని, కొబ్బ‌రికాయ కొడ‌తారు. ఆ రోజున తొలి షాట్ తీసి శ్రీ‌కారం చుడ‌తారు. సాధార‌ణంగా ఏ అన్న‌పూర్ణ స్టూడియోలోనో, రామానాయుడు స్టూడియోలోనో, లేదంటే...

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close