50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా – మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర – బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా – మిహిక‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఒక్క‌టైపోయారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రుగుతున్న పెళ్లి కావ‌డంతో.. ద‌గ్గుబాటి కుటుంబం అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లూ తీసుకొంది. కేవ‌లం 50 మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయి. అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌లో పాలుపంచుకున్నారు. టెక్నాల‌జీ పుణ్య‌మా అని రెండొంద‌ల కుటుంబాలు ఈ పెళ్లిని లైవ్ లో వీక్షించాయి. వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో ఈ పెళ్లిని ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు ఇళ్ల‌లోనే ఉండి వీక్షించారు. వారం రోజుల నుంచీ.. రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగుల‌న్నీ ఆపేశారు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క కార్య‌క్ర‌మ‌మూ జ‌ర‌గ‌లేదు. స్టూడియో మొత్తం శానిటైజేష‌న్ చేశారు. పెళ్లికి హాజ‌రైన ప్ర‌తీ అతిథికీ ఓ యాప్ ఇన్ స్టాల్ చేయించి, అందులో ఆరోగ్య స‌మాచారాన్ని నిక్షిప్తం చేయించారు. కొద్దిసేప‌టి క్రితం అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌లు వివాహ వేడుక‌కు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌భాస్ కూడా పెళ్లికి హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. క‌రోనా బారీన ప‌డ‌డంతో రాజ‌మౌళి కుటుంబం ఈ పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close