బాలీవుడ్‌కు కొత్త జోష్ ఇచ్చింది ‘ధురంధర్’. ఆ సినిమా సాధించిన వసూళ్లు హిందీ సినిమా స్టామినాను మరోసారి నిరూపించాయి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ధురంధర్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కట్ చేశారు.
రెహ్మాన్ దకైత్ తర్వాత లెయిరీ పాలకుడు ఎవరు అన్నదే సెకండ్ పార్ట్‌లో ప్రధాన కాన్ఫ్లిక్ట్. ఆ సంఘర్షణ చుట్టూనే ట్రైలర్ సాగింది. రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అనే రెండు పాత్రల్లో కనిపించిన తీరు మరో స్థాయిలో ఉంది. ఆర్. మాధవన్, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్ రాంపాల్, ఎస్పీ చౌధరి అస్లం పాత్రలో సంజయ్ దత్.. ఈ పాత్రలన్నీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.
పార్ట్ 2లో యాక్షన్‌కు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. రివెంజ్ కోణంలో నడిచే సన్నివేశాలు కథలోని తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి ఎక్కడా రాజీపడని కంటెంట్‌తో ముందుకు వస్తున్నాడని ట్రైలర్‌లోని డైలాగ్స్ వింటే అర్థమవుతోంది.
తొలి భాగం హిందీకి మాత్రమే పరిమితమైంది. అయితే సెకండ్ పార్ట్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి మార్చి 19న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.