రేప్ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు..!

” ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు… నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా…!” అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు. తనపై రగిలిపోయి ఏదేదో చేస్తున్న హీరోయిన్ పగ తీర్చడానికి హీరో ఇచ్చిన సలహా అది. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై అదే పగతో ఉన్నట్లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసమస్యలపై పోరాటం చేద్దామనుకున్న ప్రతిపక్ష నేతల్ని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులు డిసైడ్ చేసుకున్నట్లుగా అన్నారు. చివరికి రేప్ కేసులు కూడా పెట్టేస్తున్నారు.

సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలపై ఏకంగా అత్యాచారయత్నం కేసు పెట్టారు. రిమాండ్ రిపోర్టులోనూ అత్యాచారయత్నం చేయబోయారని రాసి.. న్యాయమూర్తికి సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ చూసి.. న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటిని ముట్టడిస్తే.. రేప్ కేసేమిటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఐదుగురు టీఎన్ఎస్ఎఫ్ నేతల్ని మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సారి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పోలీసులు తప్పయిపోయిందని.. కేసు పెట్టిన సెక్షన్లు మాత్రం అత్యాచారం కాదని.. చెబుతున్నారు.

మామూలుగా ఇలాంటి ముట్టడి కార్యక్రమాలకు పోలీసులు కేసులు పెట్టరు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో రెండు, మూడు గంటలు ఉంచి పంపేస్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలంటే.. ఏపీ పోలీసులు సందు దొరికితే.. అట్రాసిటీ కేసులు… హత్యాయత్నం కేసులు పెట్టేస్తున్నారు. ఎవరో వాటర్ బాటిళ్లు వేస్తే చంద్రబాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తున్నారు. ఇక్కడ రేప్ కేసులు పెట్టారు. అభాసు పాలయ్యారు. మొత్తానికి ఏపీ పోలీసుల పని తీరు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close