అమ్మాయిలూ.. పెప్ప‌ర్ స్ప్రే తీసుకెళ్లండి

దిశ ఘ‌ట‌న పై చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. ఈ ఉన్మాదానికి సినిమాలు కూడా ఓ కార‌ణ‌మ‌ని, మితిమీరిన శృంగారం, అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్ల యువ‌త పాడైపోతోంద‌ని వాదించేవాళ్లున్నారు. అలాంటివాళ్ల‌కు క‌థానాయిక‌లు ఘాటుగానే స‌మాధానం చెబుతున్నారు. దీనిపై తాజాగా రాశీఖ‌న్నా కూడా స్పందించింది.

“సినిమాల్లో చాలా మంచి చూపిస్తున్నారు. పెద్ద‌వాళ్ల‌ని గౌర‌వించండి. అమ్మానాన్న‌ల్ని బాగా చూసుకోండి అని చెబుతున్నారు. అవి ఎవ్వ‌రూ పాటించ‌రు. చెడు మాత్రం అంద‌రి దృష్టిలో ప‌డిపోతోంది. గ్లామ‌రెస్‌గా క‌నిపించ‌డం మా త‌ప్పు అన్న‌ట్టు మాట్లాడుతున్నారు. ఏది స‌భ్య‌త‌? ఏది అస‌భ్య‌త‌? అనేదానికి ప్ర‌మాణాలేమైనా ఉన్నాయా? ఒక్కోసారి నిండుగా దుస్తులు వేసుకున్నా వేలు పెట్టి చూపిస్తారు. ఒక్కోసారి ఎంత త‌క్కువ బ‌ట్ట‌లేసుకున్నా అందంగానే ఉంటుంది. మితిమీరిన పోక‌డ‌లు అనేవి చూసే దృష్టిని బ‌ట్టే ఉంటాయి” అంటోంది. అంతేకాదు.. ఈనాటి అమ్మాయిల‌కు ఓ స‌ల‌హా కూడా ఇస్తోంది. బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు పెప్ప‌ర్ స్ప్రే తీసుకెళ్లండి… ఎవ‌రైనా చెడుగా ప్ర‌వ‌ర్తిస్తే వాళ్ల కంట్లో సూటిగా కొట్టండి… అంటోంది. అయితే ఇంట్లో అమ్మానాన్న కూడా పిల్ల‌ల‌కు కౌన్సిలింగ్ చేయాల‌ని, అమ్మాయిల్ని గౌరవించ‌డం ఎలాగో నేర్పించాల‌ని ఉప‌దేశిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, "ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా" అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర...

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి : జగన్

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... ప్రసంగించారు. ఈ సందర్భంగా...
video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

HOT NEWS

[X] Close
[X] Close