ఐటీ దాడుల గురించి స్పందించిన ర‌ష్మిక‌

ఈమ‌ధ్య ర‌ష్మిక పేరు మార్మోగిపోయింది. సినిమాల విష‌యంలో కాదు. ఐటీ దాడుల విష‌యంలో. బెంగ‌ళూరులోని ర‌ష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ర‌ష్మికు వందల కోట్ల ఆస్తులున్నాయ‌ని, అందుకే ఈ దాడులు జ‌రిగాయ‌ని చెవులు కొరుక్కున్నారంతా. వీటిపై రష్మిక స్పందించింది.

”ఐటీ దాడులు జ‌రిగిన మాట వాస్త‌వ‌మే. నేను చిత్ర‌సీమ‌లో ఉన్నా. మా నాన్న బిజినెస్‌మేన్‌. మాకు టీ ఎస్టేట్‌లు ఉన్నాయి. అందుకే ఐటీ దాడులు జ‌రిగాయి. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే నేను కాస్త కంగారు ప‌డ్డాను. మా ఇంట్లో దాడులు జ‌ర‌గ‌డ‌మేంటి? అనుకున్నా. అయితే ఇవ‌న్నీ ఫార్మాలిటీలో భాగ‌మే. ఐటీవాళ్ల‌కు మా ఇంట్లో ఏమీ దొర‌క‌లేదు కూడా” అంటూ క్లారిటీ ఇచ్చింది ర‌ష్మిక‌. తాను న‌టించిన `భీష్మ‌` ఈనెల 21న విడుద‌ల అవుతోంది. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి `ఛ‌లో` తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com