‘ఆచార్య‌’లో ర‌ష్మిక‌?

చిరంజీవి – శివ కొర‌టాల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య‌`. కాజ‌ల్ ఓ క‌థానాయిక‌. అక్టోబ‌రు నుంచి కొత్త షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ప‌క్క‌న ఓ క‌థానాయిక కోసం చిత్ర‌బృందం అన్వేషిస్తోంది. చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. చివ‌రికి ర‌ష్మిక పేరు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. చ‌ర‌ణ్ – ర‌ష్మిక‌లు అక్టోబ‌రు నుంచే సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

“ర‌ష్మిక‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న విష‌యం నిజ‌మే. అయితే… ఇంకా ఖ‌రారు కాలేదు. ర‌ష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. డేట్లు స‌ర్దుబాటు కావల్సివుంది. `ఆచార్య‌` టీమ్ తొలి ఆప్ష‌న్ రష్మిక‌నే. త‌న‌కు కుద‌ర‌ని ప‌క్షంలో మ‌రో క‌థానాయిక‌ని తీసుకుంటాం” అని ‘ఆచార్య‌’ టీమ్ లోని ఓ కీల‌క స‌భ్యుడు తెలిపారు. ప్ర‌స్తుతం `పుష్ష‌`లో న‌టిస్తోంది ర‌ష్మిక‌. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా చిత్తూరు యాస కూడా నేర్చుకుంటోంది. `ఆచార్య‌`లో న‌టించాలా? వ‌ద్దా? అనే నిర్ణ‌యం ఇప్పుడు ర‌ష్మిక చేతుల్లోనే వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close