ఇంటింటికి రేషన్ బండ్ల పేరుతో వైసీపీ చేసిన భారీ స్కామ్‌కు పులిస్టాప్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పేదలందరూ రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. వచ్చే నెల ఒకటి నుంచి వాహనాలకు బియ్యం ఇవ్వరు.
వేయి కోట్లు ఖర్చు పెట్టి పది వేలవాహనాలను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంటింటికి బియ్యం ఇస్తామని చెప్పింది. కానీ ఆ వాహనాలు ఓ పాయింట్ దగ్గర ఉంటే అందరూ వెళ్లి లైన్లో నిలబడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాహనాదారులతో కలిసి భారి బియ్యం స్కాం చేశారని.. పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్దిదారులకు కేజీకి పది రూపాయల చొప్పున ఇచ్చేసి.. పంపిణీ చేసినట్లుగా నమోదు చేసుకునేవారు. ఆ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసుకునేవారు.
పేదలకు అతి స్వల్ప మొత్తం చేతికి అందేవి. అదే సమయంలో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. వాహనాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియడం లేదు. వచ్చినప్పుడు పనులు మానుకుని బండి వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. రేషన్ దుకాణాలు అయితే ఏ సమయంలో అనుకూలంగా ఉన్నా వెళ్లి తెచ్చుకునేవారు. వృధ్దులు వికలాంగలుకు .. ఇంటి వద్ద పంపిణీ చేయబోతున్నారు.