ర‌వితేజ‌కు గాయం… అయినా స‌రే..

ఎన‌ర్జీ అంటే ర‌వితేజ‌దే. తెర‌పై ర‌వితేజ‌ని చూస్తే చాలు హుషారు త‌న్నుకొచ్చేస్తుంటుంది. సెట్లో కూడా ఆయ‌న అలానే ఉంటారు. ద‌ర్శ‌కుడికీ అదే జోష్ ఉంటు సీన్ బై సీన్ చ‌క చ‌క తీసుకుపోవొచ్చు. అనిల్ రావిపూడిలో ఆ జోష్ ఉంది కాబ‌ట్టే… రాజా ది గ్రేట్ త్వ‌ర‌గా పూర్త‌య్యింది. అయితే.. ఈ సినిమా అనుకొన్న స‌మ‌యానికి రావ‌డం వెనుక ర‌వితేజ క‌మిట్‌మెంట్ చాలా ఉంద‌నే చెప్పాలి. షూటింగ్‌లో భాగంగా ర‌వితేజ‌కు గాయ‌మైనా… ఎక్క‌డా బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడ‌ట ర‌వితేజ‌. ఈ విష‌యాన్ని క‌మెడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

రాజా ది గ్రేట్‌లో శ్రీ‌నివాస‌రెడ్డి కూడా ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఈ సినిమా స‌క్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ ప్ర‌మాదం గురించిన సంగ‌తి మీడియా ముందుకు తీసుకొచ్చాడు శ్రీ‌నివాస‌రెడ్డి. ”ట్రైన్ ఎపిసోడ్ తీస్తున్న‌ప్పుడు ర‌వితేజ‌కు గాయాల‌య్యాయి. ఓ వ్యాన్ ఆయ‌న్ని గుద్దేసి ఈడ్చుకొంటూ తీసుకెళ్లింది. అనిల్ రావిపూడి పేక‌ప్ చెప్పేద్దామ‌నుకొన్నాడు. అయినా స‌రే.. ఆయ‌న షూటింగ్‌కి అంత‌రాయం క‌ల‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్‌నికొన‌సాగించారు. అందుకే ర‌వితేజ నిజంగా గ్రేట్‌” అని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడే త‌న‌కో శుభ‌వార్త కూడా తెలిసింద‌ట‌. ”చాలా యేళ్ల త‌ర‌వాత నేను మళ్లీ తండ్రి కాబోతున్నా. ఈ గుడ్ న్యూస్ నాకు ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే తెలిసింద‌”న్నాడు. ఎనీవే.. కంగ్రాట్స్ టూ శ్రీ‌నివాస‌రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close