ధ‌మాకాకీ రీషూట్లు త‌ప్ప‌లేదా?

ఈమ‌ధ్య ర‌వితేజ సినిమా అంటే… రీషూట్లకూ కొంత బ‌డ్జెట్ కేటాయించుకోవాల్సివ‌స్తోంది. ఎందుకంటే సినిమా అంతా పూర్త‌య్యాక‌, మ‌ళ్లీ ఓసారి చెక్ చేసుకోవ‌డం, త‌ప్పొప్పులు స‌రి చేసుకోవడం కామ‌న్ అయిపోయింది. అందులో భాగంగానే `ధ‌మాకా`కీ రీ షూట్లు త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌కుడు. ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందించారు.

తాజాగా ఆ సినిమాలో కొన్ని సీన్లు రీ టైట్ చేసి, రీ షూట్ చేసిన‌ట్టు స‌మాచారం. అందుకోసం ఓ కొత్త రైట‌ర్ స‌హ‌కారం కూడా తీసుకొన్నార్ట‌. ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకొన్న `కార్తికేయ 2`లో కొన్ని స‌న్నివేశాల‌కు ర‌చ‌నా స‌హ‌కారం అందించిన రైట‌ర్‌… ధ‌మాకా కోసం కూడా వ‌ర్క్ చేశాడ‌ని, ఆయ‌న కొత్త‌గా రాసిన స‌న్నివేశాల్ని మ‌ళ్లీ తీశార‌ని స‌మాచారం అందుతోంది. ఈసారి ఫైన‌ల్ అవుట్ పుట్ చూసుకొని, ర‌వితేజ సంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని, ఇప్పుడు ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close