రవితేజ మాస్ జాతర పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇది. డైలాగ్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న భాను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఆ సమయానికి వస్తుందా లేదా అనే చిన్న అనుమానం. ఎందుకంటే ప్రస్తుతం కింగ్డమ్తోనే ఇంకా బిజీగా ఉన్నారు వంశీ. దీని తర్వాత వార్ 2 ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. మాస్ జాతర పనులు ఎంతవరకు వచ్చాయో ఇంకా ఓ అంచనాకు రాలేదు. పైగా 27 అంటే ఈపాటికి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. అందుకే.. మాస్ జాతర రిలీజ్‌పై చిన్న డౌట్.
అయితే ఇప్పుడా అనుమానం అవసరం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్‌కి శ్రీకారం చుడుతూ ‘ఓలే ఓలే’ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేయనున్నారు. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 27న విడుదల’ అని అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ వినాయక చవితి కానుకగా రావడం ఖాయమైంది. రవితేజ కెరీర్లో 75వ సినిమా ఇది. ధమకా తర్వాత మళ్లీ విజయాన్ని అందుకోలేకపోయిన రవితేజకి మాస్ జాతర విజయం చాలా కీలకం.