టైగ‌ర్‌@రూ.50 కోట్లు

ఓ సినిమా తీసే ముందు నిర్మాత‌ల‌కు ఒక‌టికి ప‌ది ర‌కాలుగా ఆలోచిస్తారు. ఆ హీరో గ‌త సినిమా రిజ‌ల్టేంటి? ఎంతొచ్చింది? ఎంత పోయింది? అనే లెక్క‌లు వేసుకునే బ‌డ్జెట్ కేటాయిస్తారు. అయితే.. ర‌వితేజ సినిమాల‌కు ఇలాంటి లెక్క‌లుండ‌వు. త‌న ప్ర‌తీ సినిమాకీ, బ‌డ్జెట్ పెరుగుతూ పోతుంటుంది. త‌న అదృష్టం కొద్దీ.. త‌న‌కూ అలాంటి నిర్మాత‌లే దొరుకుతుంటారు. ర‌వితేజ `ఖిలాడీ` డిజాస్ట‌ర్ అయిపోయింది. అయితే… ఆ ఎఫెక్ట్ ఇప్పుడు `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`పై ఏమాత్రం ప‌డ‌లేదు.

ర‌వితేజ కొత్త సినిమా `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఇటీవ‌లే క్లాప్ కొట్టుకున్న సంగ‌తి తెలిసిందే.వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా బ‌డ్జెట్ ప్ర‌స్తుతానికి రూ.50 కోట్లు. ఆ త‌ర‌వాత ప‌రిస్థితుల్ని బ‌ట్టి కొంచెం పెర‌గొచ్చు కూడా. ఖిలాడీకి దాదాపుగా రూ.45 కోట్ల వ‌ర‌కూ పెట్టారు. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎంత తెచ్చుకుందో తెలిసిందే. అయినా స‌రే.. ఆ ప్ర‌భావం `టైగ‌ర్‌`పై లేదు. ఓ కొత్త ద‌ర్శ‌కుడికి సినిమా అప్ప‌గించినా, క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు కూడా వెనుకంజ వేయ‌డం లేదు. ర‌వితేజ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అందుకే… ర‌వితేజ కెరీర్‌లోనే ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత బ‌డ్జెట్ ఈ సినిమాకి కేటాయించ‌డానికి నిర్మాత‌లు రెడీ అయిపోయారు. అభిషేక్ సంస్థ నుంచి `క‌శ్మీర్ ఫైల్స్‌` అనే సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ ఉత్సాహంతోనే.. `టైగ‌ర్‌`కీ బ‌డ్జెట్ లిమిట్స్ ఎత్తేశారిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close