ర‌వితేజ పారితోషికం తీసుకోవ‌డం లేదా?

ర‌వితేజ పారితోషికం ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకొంటూపోతున్నాడు. రెండేళ్ల క్రితం ర‌వితేజ పారితోషికం రూ.12 నుంచి రూ.15 కోట్లు. ఇప్పుడు అది రూ.30 కోట్ల‌కు చేరింది. ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని సినిమా పారితోషికం స‌మ‌స్య‌తోనే ఆగిపోయింది. ర‌వితేజకు రూ.30 కోట్లు ఇవ్వ‌లేమని మైత్రీ మూవీస్ చేతులు ఎత్తేసింది.

పారితోషికం విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌ని ర‌వితేజ‌.. ఇప్పుడు పారితోషికం లేకుండానే ఓ సినిమా చేసేస్తున్నాడు. అదే.. ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌ర్‌’. బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన `రైడ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఈ సినిమాని కేవ‌లం 45 రోజుల్లో పూర్తి చేయాల‌న్న‌ది టీమ్ నిర్ణ‌యం. పైగా ద‌ర్శ‌కుడు, హీరో.. ఇద్ద‌రూ పారితోషికం తీసుకోవ‌డం లేదు. వీళ్ల‌కు లాభాల్లో వాటా ద‌క్కుతుంది. ర‌వితేజకి ఓ సొంత బ్యాన‌ర్ ఉంది. సో.. త‌ను కూడా ఓ నిర్మాతే. ఈ క‌థలో సింహ‌భాగం ఓ పెద్ద సెట్లో జ‌రుగుతుంది. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ ప‌రంగానూ జాగ్ర‌త్త‌లు తీసుకొంటే కేవ‌లం శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ తోనే టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకోవొచ్చు. ఆ త‌ర‌వాత ఎంతొచ్చినా అది బోన‌సే. ర‌వితేజ ఇలా పారితోషికం విష‌యంలో కాస్త వెసులుబాటు క‌ల్పిస్తే… నిర్మాత‌లు హ్యాపీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close