‘డిస్కోరాజా’ టీజ‌ర్‌: హంగామా బానే వుంది!

మాస్ మ‌హారాజా – ఇప్పుడు ‘డిస్కోరాజా’ అవ‌తారం ఎత్తాడు. విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. టైటిల్ క్రేజీగా, మాసీగా ఉన్నా – కాన్సెప్ట్ కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. టీజ‌ర్ చూస్తే అదే తెలుస్తుంది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్‌ – అనుమ‌తి లేకుండా కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌లు చేసిన ఓ ప్ర‌యోగం నుంచి `డిస్కోరాజా` పుట్టుకొస్తాడు. అత‌నెవ‌రు? ఆ ప్ర‌యోగం ఎందుకు జ‌రిగింది? అనేదే ఈ క‌థ‌లో బేస్‌.

70 సెక‌న్ల పాటు సాగిన టీజ‌ర్ ఇది. మంచు కొండ‌లు, రీసెర్చ్ లాబులూ – హంగామా అదిరిపోయింది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ అంటూ ఓ హింట్ ఇస్తూ ఈ టీజ‌ర్ ని క‌ట్ చేశారు. చివ‌ర్లో మాస్ రాజా ర‌వితేజ స్టైల్ ఆఫ్ ఫ‌న్ – ఓ షాట్‌లో చూపించారు. యాక్ష‌న్ సీన్‌ని కూడా ర‌వితేజ స్టైల్‌లో స్టైలీష్‌గా, అల్ల‌రిగా డిజైన్ చేశారు. మేకింగ్‌, ఈ టీజ‌ర్‌కి ఇచ్చిన ఆర్‌.ఆర్ అన్నీ బాగున్నాయి. మొత్తానికి ఓ కొత్త త‌ర‌హా క‌థ తెర‌పై చూడ‌బోతున్నామ‌న్న భ‌రోసా క‌లిగింది. జ‌న‌వ‌రి 24న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.