ట్రైల‌ర్ టాక్‌: ధ‌ర్మం కోసం డ్యూటీ చేసే ‘రామారావు’

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఈనెలాఖ‌రున విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది. ర‌వితేజ సినిమా అంటే.. ఫ‌న్‌, పంచ్‌లూ, వెరైటీ క్యారెక్ట‌రైజేష‌న్ ఆశిస్తారు. అయితే.. అందుకు `రామారావు` పూర్తిగా విభిన్నంగా క‌నిపించాడు. ఈ సినిమాలో ర‌వితేజ ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిగా న‌టించారు. “ఇన్నాళ్లూ ఓ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్‌గా చ‌ట్టం కోసం న్యాయం కోసం ప‌నిచేసిన నేను.. ఇప్పుడు రామారావుగా ధ‌ర్మం కోసం ప‌నిచేస్తా“ అనే డైలాగ్ తోనే… హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంది. ఓ ఆప‌రేష‌న్‌లో, అమాయ‌కులైన క‌ష్ట‌జీవులు బ‌లైపోతారు, చాలా మంది ఆచూకీ దొర‌క‌దు. అందుకోసం హీరో చేసిన అన్వేష‌ణ ఈ క‌థ అనిపిస్తోంది. డైలాగులు, మూడ్‌, టేకింగ్ ఇవ‌న్నీచూస్తుంటే… థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఈ సినిమాలో చాలానే ఉండేట్టు క‌నిపిస్తున్నాయి. ఈమ‌ధ్య వ‌చ్చిన ర‌వితేజ సినిమాల్లో `రామారావు` భిన్నంగా ఉండేట్టే క‌నిపిస్తోంది. యాక్ష‌న్ సీన్ల‌కు పెద్ద పీట వేశారు. వేణు తొట్టెంపూడి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న పాత్ర కూడా క‌థ‌కు మ‌లుపు కాబోతోంది. నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్‌, ఎలివేష‌న్లూ… అన్నీ నీట్‌గానే ఉన్నాయి. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.