కిక్-2లో చేసిన పొరపాటు మళ్ళీ చేయబోనన్న రవితేజ

హైదరాబాద్: మాస్ మహారాజా పొరపాటు చేశాడట. కిక్-2 విషయంలో తాను పొరపాటు చేశానని రవితేజ చెప్పారు. సినిమా లెంగ్త్ ఎక్కువైందని తనకు అనిపించినప్పటికీ నిర్ణయాన్ని సురేందర్ రెడ్డికి వదిలేశానని తెలిపారు. మొదటిరోజు చూస్తే సెకండ్ హాఫ్‌లో ఆడియెన్స్ బోర్ ఫీలవుతున్నట్లు కనుగొన్నామని, వెంటనే రెండోరోజున 20 నిమిషాలు కత్తిరించామని చెప్పారు. ఇప్పుడు చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతోందని అన్నారు. వాస్తవానికి తన ప్రతి చిత్రం విషయంలో తుది నిర్ణయం తానే తీసుకుంటానని, ఈసారి మాత్రం దర్శకుడు సీనియర్ కాబట్టి, ఆయన అభిప్రాయాన్ని గౌరవించాలని భావించి నిర్ణయాన్ని అతనికి(సురేందర్ రెడ్డికి) వదిలేశానని చెప్పారు. అప్పటికీ సినిమా నిడివి ఎక్కువైందని అతనికి చెబుతూనే ఉన్నానని, అతను పట్టించుకోలేదని అన్నారు.

ఈ చిత్రంద్వారా ఒక గుణపాఠం నేర్చుకున్నానని రవితేజ చెప్పారు. సినిమాలో ఏది ఆకట్టుకుంటుందీ, ఏది ఆకట్టుకోదనేది తాను బాగా అంచనా వేయగలనని, ఇకనుంచి ప్రతి సినిమా విషయంలో తన అంచనాననుసరించే నడుస్తానని అన్నారు. అభిమానులను నిరాశపరచకుండా చేయాల్సిన బాధ్యత తనపైనే ఉంటుందని చెప్పారు. తన తదుపరి చిత్రం రాయల్ బెంగాల్ టైగర్ పూర్తిగా పక్కా మసాలా చిత్రమని తెలిపారు. కిక్-2లో కొద్దిగా ప్రయోగాలు చేశామని, అయితే రాయల్ బెంగాల్ టైగర్ చిత్రంలో అలా కాదని అది పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్ అని చెప్పారు. కిక్-3 కూడా వస్తుందని, అయితే ఈసారి తాము మరింత జాగ్రత్తగా ఉంటామని రవితేజ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close