రాయలసీమ ఏపీలో ఉంటే అభివృద్ధి చెందదా?

రాయలసీమ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే అభివృద్ధి చెందదా? రాయలసీమవాసులను ఈ ప్రశ్న తొలిచేస్తున్నట్లుగా కనబడుతోంది. మొత్తం రాయలసీమవాసులను కాకపోయినా ప్రధానంగా కర్నూలు జిల్లా ప్రజలను, నాయకులను తమ జిల్లా అభివృద్ధి ఏమిటనే ప్రశ్న లేదా సందేహం వెంటాడుతోంది. మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో కర్నూలు గురించిన ప్రస్తావనే ఎక్కువగా తెరమీదికి వస్తోంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు చెందిన అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాద ప్రతివాదాల్లోనూ అమరావతి, విశాఖపట్టణాల అభివృద్ధికి సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా దొర్లుతున్నాయి తప్ప రాయలసీమ గురించి ఎక్కువగా మాట్లాడుకోని పరిస్థితి కనబడుతోంది. కర్నూలుకు హైకోర్టు ఇవ్వడం తప్ప మరో అంశం గురించి చర్చ జరగడంలేదు.

ఈమధ్య రాయలసీమ ఉద్యమ నాయకులు రకరకాల వ్యాఖ్యలు చేశారు. డిమాండ్లూ చేశారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కూడా అంటున్నారు. జ్యుడీషియల్‌ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. హైకోర్టు వస్తున్నందుకు కొందరు సంతోషపడుతున్నారు. కాని దానివల్ల కర్నూలుగాని, రాయలసీమగాని అభివృద్ధి చెందుతాయా అనే సందేహం వెంటాడుతోంది. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి, కొన్నాళ్ల తరువాత తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడి, 2014లో మళ్లీ ఆంధ్ర-తెలంగాణగా విడిపోయి , వైకాపా అధికారంలోకి వచ్చిన సమయానికి కూడా ‘రాయలసీమ ఇప్పటికీ వెనుకబడి ఉంది’ అనే మాట వినిపిస్తోంది.

ఇప్పటివరకు అభివృద్ధి చెందని రాయలసీమ మూడు రాజధానుల కారణంగా అభివృద్ధి చెందుతుందా? అని ఆ జిల్లాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు విశాఖపట్టణం చాలా దూరమంటున్నారు. విశాఖను హైదరాబాదును మించిన మహానగరం చేస్తామని వైకాపా మంత్రులు, నేతలు అదేపనిగా చెబుతున్నారు. అంటే ప్రభుత్వానికిగాని, వైకాపా నేతలకుగాని విశాఖపట్టణం తప్ప రాష్ట్రంలో మరో నగరం కనబడటంలేదనే భావన సీమ ప్రజల్లో ఏర్పడుతోంది. ఉమ్మడి ఏపీలో పాలకులు హైదరాబాద్‌ జపం చేస్తే, ఇప్పుడు విశాఖపట్టణం నామస్మరణ చేస్తున్నారు.

అసలు ప్రభుత్వంగాని, మంత్రులుగాని సీమను ఏవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో చెప్పడంలేదు. రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలిపోతే అమరావతిని ఏవిధంగా అభివృద్ధి చేస్తామో కొన్ని అంశాలైనా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో రాయలసీమను కలిపేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన రెడ్డి ‘కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయండి’ అని డిమాండ్‌ చేశాడు. కర్నూలు జిల్లాను తెలంగాణలో విలీనం చేసి, మిగతా మూడు సీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ‘గ్రేటర్‌ రాయలసీమ’ గా చేయాలని అన్నాడు. విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమవాసులకు కష్టాలు తప్పవని, ఈ కష్టాలు తాము పడలేమని, అందుకే కర్నూలును తెలంగాణలో కలిపేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశాడు.

అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులు కొంతకాలం కిందట తమ బతుకులు ఆగమైపోయాయని, రోడ్డున పడ్డామని అంటూ ‘కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణలో కలపండి’ అని డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో తమకు భద్రత లేదని, తమ జీవితాలు పాడైపోయాయని, అందుకే తెలంగాణలో కలుస్తామని అన్నారు. అమరావతి రీజియన్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. విశాఖపట్టణమే రాజధాని అని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత రాయలసీమలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో….!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close