రాయలసీమలో మూడో విమానాశ్రయం రెడీ..!

రాయలసీమకు ఎయిర్‌ కనెక్టివిటీ విస్త్రతం అయింది. దాదాపుగా ప్రతీ జిల్లాకు… విమాన ప్రయాణ సౌకర్యం ఏర్పడుతోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం జాతికి అంకితం అవుతోంది. కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు సమీపాన రాతికొండల్లో ఏయిర్ పోర్టు నిర్మాణం చేపట్టారు. ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు వేశారు. విదేశీ సంస్థలకు అక్కడి భూములు చూపించి కొన్ని పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో 2017 జూన్ లో విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్ధాపన చేశారు. శరవేగంగా పూర్తి చేశారు. గత నెలలోనే ట్రయల్ రన్ విజయవంతమయింది.

రన్ వే , అప్రాన్, టర్మినల్, టవర్ భవనం, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ను 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దాదాపు 85 మంది ప్రయాణించే ఏటిఆర్ -760 విమానాలు ఓకేసారి 4 పార్కింగ్ చేసుకోగలిగేలా టెర్మినల్ కు ఎదురుగా ఆప్రాన్ నిర్మించారు. తొలి విడతగా కర్నూలు విమానాశ్రయం నుంచి గన్న వరం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఏయిర్ పోర్టులకు డొమెస్టిక్ విమానాలు నడపవచ్చని అధికారులు చెప్తున్నారు. విమానాశ్రయం ఏర్పాటు ద్వారా విదేశీ పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టే దిశగా ఆకర్షించడానికి ఓ పెద్ద ముందడుగు పడిందని అనుకోవచ్చు.

ఎయిర్ పోర్టు సమీపంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటయింది. మరికొన్ని ప్రముఖ కంపెనీలకు భూమిపూజ చేశారు. కర్నూలు జిల్లా వాసులకు రవాణా సౌలభ్యం సులభతరం కానుంది. ఇప్పటికే అనంతపురం వాసులకు… అత్యంత చేరువగా… బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ ఉంది. అలాగే.. తిరుపతిలో .. కడపలో కూడా విమాశ్రయాలు నడుస్తున్నాయి. కుప్పంలోనూ.. ఓ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపనచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close