రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను పూర్తిగా లేదా మెజార్టీ వాటాలను ఆమ్మేయాలని ఆ టీమ్ ఓనర్ డియాజియో నిర్ణయం తీసుకుంది. ఈ టీమ్ ను తన యూబీ గ్రూప్ సబ్సిడరీ కంపెనీ తరపున విజయ్ మాల్యా కొనుగోలు చేశారు. ఆయన దివాలా తీసి పారిపోవడంతో.. ఆయన కంపెనీలను డియోజియో టేకోవర్ చేసింది. ఆ టీమ్ కూడా వారి వద్దకు వచ్చింది. అప్పట్నుంచి మంచి సమయం చూసి అమ్మేయాలనుకుంటోంది. IPL 2025లో తమ మొదటి టైటిల్ సాధించి మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో బేరం పెట్టేసింది.
వచ్చే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కల్లా ఓనర్ షిప్ మారిపోయే అవకాశం ఉంది. RCB మెన్స్ IPL , విమెన్స్ WPL ఫ్రాంచైజీలను కలిగి ఉన్న రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను సొంతం చేసుకునేందుకు ఐదారు బడా కార్పొరేట్ గ్రూపులు రెడీగా ఉన్నాయి. అందులో అదాని, కోటక్ మహింద్రా, ఆనంద్ మహింద్రా, అదర పూనావాలా,జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వంటి వారు ఉన్నారు. RCB నుంచి అమ్మేయడానికి డియాజియో ఏకంగా 2 బిలియన్లు ఆశిస్తోంది. అంటే సుమారు 17,000 కోట్ల రూపాయలు.
అయితే ఆర్సీబీకి ఉన్న క్రేజ్…బ్రాండ్ వాల్యూ, ఐపీఎల్ క్రికెట్‌కు బాహుబలిగా ఎదిగిన వైనంతో పోలిస్తే.. ఆ టీమ్‌పై రూ. ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉంటాయని చెబుతున్నారు. RCB సేల్ IPLలో రికార్డ్ వాల్యూ సెట్ చేస్తుందని ..ఐపీఎల్ సృష్టికర్తగా పేరు పొందిన లలిత్ మోదీ చెబుతున్నారు. అదే నిజం కానుంది. ఇందులో అదానీ రేసులో ఉంటే ఆ గ్రూప్ కు ఎదురు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.


