భారత రియల్ ఎస్టేట్ రంగం గత నాలుగు త్రైమాసికాల తగ్గుదల నుండి క్రమంగా మెరుగుపడుతోందని నైట్ ప్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. నైట్ ఫ్రాంక్-నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) ఆగస్టు 2025లో విడుదల చేసిన సెంటిమెంట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఏప్రిల్-జూన్ లో కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 56కి చేరింది. ఇది Q1 2025లోని 54 నుండి స్వల్ప పెరుగుదల. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 61కి పెరిగింది. ఇది రాబోయే ఆరు నెలల్లో రంగం మరింత పుంజుకుంటుందన్నదానికి సూచికగా రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సెంటిమెంట్ ఇండెక్స్ సర్వే డెవలపర్లు, బ్యాంకులు, NBFCలు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల వంటి స్టేక్హోల్డర్ల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. గత నాలుగు క్వార్టర్లలో ఇండెక్స్ క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, Q2లో ఈ మార్పు రంగానికి సానుకూల సంకేతం. ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల తగ్గింపు , ప్రీమియం హౌసింగ్ డిమాండ్ వల్ల పరిస్తితి మెరుగుపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 మొదటి అర్ధభాగంలో 100 బేసిస్ పాయింట్ల రెపో రేట్ కట్ చేసింది, ఇది రుణాల వడ్డీ రేట్లను తగ్గించి, లిక్విడిటీని పెంచింది. డెవలపర్లు మ, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. డెవలపర్ల ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 53 నుండి 63కి పెరిగింది, ఇది ఫైనాన్సింగ్ సులభతరం కావడం , లగ్జరీ హౌసింగ్ డిమాండ్ పెరగడం వల్ల సాధ్యమయింది.
రెసిడెన్షియల్ సెగ్మెంట్లో, రూ. 1 కోటి పైన ఉన్న ప్రీమియం , లగ్జరీ హోమ్స్ డ్రైవింగ్ ఫోర్స్‌గా మారాయి. స్టేక్‌హోల్డర్లలో 70% మంది రాబోయే నెలల్లో రెసిడెన్షియల్ లాంచ్‌లు స్థిరంగా లేదా పెరుగుతాయని భావిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ ఫ్యూచర్ స్కోర్ 63తో ముందంజలో ఉంది.