భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో దేశంలోని 28 ప్రధాన లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం రూ. 92,437 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో డిమాండ్ మరింత బలపడింది.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 18 వేల కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. ఇది ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, ఆఫీస్ స్పేస్‌లు వల్ల సాధ్యమైంది. తర్వాత స్థానాల్లో డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీ్, లోథా, శోభా వంటి కంపెనీలు ఉన్నాయి. DLF, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అతిపెద్ద రియల్టీ సంస్థ. బెంగళూరు IT హబ్‌గా, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా డిమాండ్ పెరిగింది. ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్ వంటి బెంగళూరు కంపెనీలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులతో మంచి బుకింగులు సాధించాయి.
ఈ 92వేల కోట్ల బుకింగులు..కేవలం లిస్టెడ్ కంపెనీలవే. మామూలుగా అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో వీటి వాటా కంటే.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిన్న బిల్డర్లు వద్ద కొనుగోలు చేస్తారు. అలాగే మైహోమ్ లాంటి కుటుంబ కంపెనీలు.. నాన్ లిస్టెడ్ కంపెనీలు ఇంకా ఎక్కువ మార్కెట్ సాధిస్తూంటాయి. అందుకే రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్లు మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.