విశాఖకు రైల్వే జోన్ రాని పాపం జగన్‌ రెడ్డిదే !

ఐదేళ్ల కిందట ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందును విశాఖకు రైల్వేజోన్‌ను కేంద్రం కేటాయించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో టీడీపీ బీజేపీతో కటీఫ్ చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. టీడీపీకి పోటీకి వైసీపీ కూడా ఉత్తుత్తిపోరాటం చేసింది. అందరూ తమ విజయమేనని క్లెయిమ్ చేసుకున్నారు. అయితే ఐదేళ్లు అయినా ఇప్పటికీ రైల్వే జోన్ ఓ కలగానే మిగిలింది. కనీసం పనులు ప్రారంభం కాలేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… మంజూరు అయిన రైల్వే జోన్ పనులు ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తారనుకున్నారు. కానీ ప్రశ్నించడమే మానేశారు. వాస్తవానికి అవసరమైన భూములు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ కేంద్రం రూపొందించిన డీపీఆర్‌లో యాభై మూడు ఎకరాల భూములు కావాలని తేల్చారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. కానీ జోన్ అవసరం లేదన్నట్లుగా ఏపీ సర్కార్ ఉంది. యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు. పైగా రైల్వే భూమిని ఇతర అవసరాల కోసం తీసుకుంది.

విశాఖలో గత ఐదేళ్లుగా కొన్ని వేల ఎకరాల భూదందా జరిగింది. చివరికి రామానాయుడు స్టూడియోనూ కూడా కబ్జా చేశారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. . కానీ ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నం అయిన రైల్వేజోన్ కోసం యాభైమూడు ఎకరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. రైల్వేజోన్ వస్తే జగన్ రెడ్డికి ఏదో నష్టం ఉందని… లేకపోతే విశాఖ … ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న కారణంగా భూములు ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోది. కేంద్రం మంజూరు చేసినా.. దాన్ని తెచ్చుకోలేనంత అసమర్థత జగన్ రెడ్డి సర్కార్ లో పేరుకుపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close