అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా… అస‌లు కార‌ణం ఇదే?

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనారోగ్యం నుండి దాదాపు కోలుకున్న‌ట్లే. పులి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని కేటీఆర్ గొప్ప‌గా చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ భ‌వ‌న్ కు రావ‌టం, పార్టీ నేత‌ల‌ను క‌లుస్తుండ‌టంతో అసెంబ్లీకి వ‌స్తార‌ని పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు.

కానీ, బ‌డ్జెట్ స‌మావేశాల ఫ‌స్ట్ డేనే కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఎందుకు రాలేద‌ని ఆరా తీయ‌గా పార్టీ వ‌ర్గాలు ఓ లాజిక్ చెప్తుంటే, అస‌లు విష‌యం మాత్రం ఇంకొటి ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

పార్టీ వ‌ర్గాల ప్ర‌కారం… అమావాస్య ముందుకు కేసీఆర్ బ‌య‌ట‌కు రార‌ని, ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ ఇదే ఫాలో అవుతున్నార‌న్న‌ది ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాట‌.

కానీ, అస‌లు నిజం మ‌రొక‌టి అనేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ జ‌రుగుతున్న చ‌ర్చ‌. సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుండే కేసీఆర్ కు గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య అస్స‌లు ప‌డేది కాదు. ఓడిపోయాక కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓడిపోయిన రోజు మ‌ర్యాద‌గా కూడా కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి రాజీనామా ప‌త్రం ఇవ్వ‌లేదు. ఓఎస్డీ ద్వారా పంపారు… నిజానికి ఇది గ‌వ‌ర్న‌ర్ ను అవ‌మానించ‌ట‌మే అని అప్ప‌ట్లో ప్ర‌జాస్వామ్యవాదులు ఫైర్ అయ్యారు.

తాజాగా, గ‌వ‌ర్న‌ర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. గ‌వ‌ర్న‌ర్ ను వెల్ క‌మ్ చేసే స‌మ‌యంలోనూ, స్పీచ్ ముందు కూడా ఎదురు ప‌డాల్సి వ‌స్తుంది. కానీ, అది కేసీఆర్ కు ఇష్టం లేద‌ని అందుకే గ‌వ‌ర్న‌ర్ స్పీచ్ కు డుమ్మా కొట్టార‌ని, గ‌వ‌ర్న‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ దూరంగానే ఉంటార‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ పెట్టే రోజు మాత్ర‌మే కేసీఆర్ స‌భ‌కు హ‌జ‌రుకాబోతున్నార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close