కోకాపేటలో భూమి రికార్డు స్థాయిలో 150 కోట్లకు దాటిపోయింది. హెచ్‌ఎండీకే రెండు ప్లాట్లకు శుక్రవారం వేలం వేసింది. ఈ వేలంలో రెండు ప్లాట్లను హైదరాబాద్‌కు చెందిన జీహెచ్ఆర్, జాతీయ స్థాయిలో పేరున్న గోద్రెజ్ రియాల్టీ దక్కించుకున్నాయి.
హెచ్ఎండీఏ ఈసారి నియోపొలిస్ లేఅవుట్లో రెండు ప్రధాన ప్లాట్లను వేలం వేసింది. మొత్తం ఈ రెండు ప్లాట్లకు రూ. 1,600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. బేస్ ప్రైస్ రూ. 99 కోట్ల గా ఉన్నప్పటికీ, డెవలపర్ల మధ్య తీవ్ర పోటీతో ధరలు 50 శాతానికిపై పైగా పెరిగాయి. జీహెచ్ఆర్ ఇన్ ఫ్రా ఎకరం రూ. 151 కోట్లకు కొనుగోలు చేసింది. గోద్రెజ్ సంస్థ ఎకరం 147 కోట్లకు సొంతం చేసుకుంది.
నియోపొలిస్, గోల్డెన్‌మైల్‌లో ఇప్పటివరకు 44 ఎకరాల్లో 20 ఎకరాలు విక్రయమయ్యాయి .హైదరాబాద్‌కు హెడ్‌క్వార్టర్స్ ఉన్న జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, స్థానిక రియల్టీ గ్రూప్‌లలో ముందంజలో ఉంది. ఈ ప్లాట్‌తో వారు కోకాపేట్లో కొత్త లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని ప్రణాళిక. జాతీయ స్థాయి గోద్రెజ్ ప్రాపర్టీస్, ముంబై ఆధారిత కంపెనీ, ఈ ప్లాట్‌ను గెలిచి హై-ఎండ్ మిక్స్డ్-యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉంది. డిసెంబర్లో మరో రెండు ప్లాట్ల వేలం వేయనున్నారు.