పుష్ప సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లర్. అలాంటి వారు ఉంటారా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఉంటారని అప్పుడప్పుడు దొరికే స్మగ్లర్ల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది. రెండు రోజుల కిందట కడప జిల్లాలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా ఒకరిని గుర్తు పట్టిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అతని పేరు నాగదస్తగిరెడ్డి.. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గా గుర్తించారు. ఎందుకంటే అతనిపై 86 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి.
లంకమల్ల అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల నుంచి రూ.కోటి విలువైన టన్ను ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు స్వాధీనం. చేసుకున్నారు. నాగదస్తగిరి రెడ్డిపై 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు ఉన్నాయి. ఆయన భార్య కూడా పెద్ద స్మగ్లరే. స్మగ్లర్ భార్య లూలుబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఢిల్లీలోని బడా స్మగ్లర్ కు ఎర్రచందనం దుంగలు సరఫరా చేసి.. హవాలా ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇలా డబ్బులు పంపుతున్న హవాలా వ్యాపారి విక్రమ్ సింగ్ సోలంకి వారం క్రితం అరెస్టు అయ్యారు.
పదుల సంఖ్యలో ఎర్రచందనం కేసులు ఉన్నాయంటే ఇతని వెనుక బడా వ్యక్తులు ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఎవరూ లేకపోతే ఇన్ని కేసుల్లో అరెస్టు అయి మళ్లీ బయటకు రావడం సాధ్యం కాదు. దొరకకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ దస్తగిరిరెడ్డి ఎవరి అనుచరుడో.. ఎవరితో లావాదేవీలు నిర్వహిస్తారో పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈయన భార్య కూడా స్మగ్లింగ్ క్వీన్ అని చెప్పారు కాబట్టి.. ఆ కోణంలో పుష్ప 3 సబ్జెక్ట్‌ను దర్శకుడు డెవలప్ చేసుకోవచ్చేమో ?