కెసిఆర్‌ ఉభయతారకం

తెలంగాణ శాసనసభలో నవంబరు 7న బిజెపి సభ్యులు నిరసన ఉద్రిక్తతకు దారితీస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏదో సర్దిచెప్పి వారి ఆందోళన విరమించపచేశారు. అయితే ఎంఎల్‌ఎ చింతల రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి ముందున్న మైకును లాగివేయడంపై మాత్రం ఆయన ప్రస్తావించలేదు. స్పీకర్‌ కూడా దీన్ని అభిశంసించలేదు.ఈ విషయమై మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. బిజెపితో మంచిగా వుండేదుకూ విన్‌ విన్‌ పరిస్థితి కోసం కెసిఆర్‌ మౌనం దాల్చారని విమర్శించారు. వాస్తవానికి ఇది విన్‌విన్‌ కాదు,మజ్లిస్‌ బిజెపిలతో ట్విన్‌ విన్‌ ఆయన కోరుకుంటున్నారని నేను ట్వీట్‌ చేశాను. అందుకు తగినట్టే ఈ రోజు అక్బర్‌ కెసిఆర్‌ను రెచ్చిపోయి పొగిడేశారు. ముస్లిం మైనార్టిల కోసం ఇంత చేసినముఖ్యమంత్రి మరెవరూ లేరని ఆకాశానికెత్తేశారు. ఏదో రాజకీయంగా చెప్పడం గాక సహజసిద్ధమైన నాటకీయ శైలిలో వూగిపోతూ పొగిడారు. కాంగ్రెస్‌ నాయకులు ఏదో అడ్డుతగలబోతే ఆగ్రహంగా స్పందించారు. అంతేగాక మేము ఉభయులం కలసి ఘన విజయం సాధిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో కెసిఆర్‌ బల్లపై చరిచి సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది. ఈ ప్రసంగం చూశాక నా వ్యాఖ్య పూర్తిగా సరైందని అర్థం కావడమే కాదు, మజ్లిస్‌ టిఆర్‌ఎస్‌ బంధం ఎంత దృఢమైందో తెలిసిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

సుధాకర్ కేసులో “గుర్తు తెలియని అధికారుల”పై సీబీఐ కేసులు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా గుర్తు తెలియని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసింది. విశాఖ సీబీఐ ఎస్పీ సుధాకర్ వద్దకు వెళ్లి వాంగ్మూలం...

HOT NEWS

[X] Close
[X] Close