టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల హంగామా

త్వ‌ర‌లో తెలుగు బాక్సాఫీసు క‌ళ‌క‌ళ‌లాడ‌బోతోంది. కొత్త సినిమాలు వెల్లువ‌లా రాబోతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించేశారంతా. ఆర్‌.ఆర్‌.ఆర్‌ని మార్చి 25న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇది వ‌ర‌క‌టిలా రెండు డేట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో… ఈ రిలీజ్ డేట్ పై భ‌రోసా ఏర్ప‌డింది. దాంతో.. మిగిలిన సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టైంది. వ‌రుస‌గా ఆచార్య‌. భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట రిలీజ్ డేట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. మే 12న `స‌ర్కారు వారి పాట‌`ని విడుద‌ల చేస్తున్నారు. భీమ్లా నాయ‌క్ కు మాత్రం రెండు రిలీజ్ డేట్లు వ‌చ్చాయి. అయితే ఫిబ్ర‌వ‌రి 25న లేదంటే ఏప్రిల్ 1న ఈచిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఫిబ్ర‌వ‌రి 25నే ఈ సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న‌ది ఓ టాక్‌. ఏప్రిల్ 29న ఆచార్య రాబోతోంది. ఈ మేర‌కు చిత్ర‌బృందం అధికారికంగా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించింది. ఎఫ్ 3.. ఒక‌రోజు ముందుగా అంటే ఏప్రిల్ 28న వ‌స్తోంది. రెండు పెద్ద సినిమాల మ‌ధ్య ఒక‌టే రోజు గ్యాప్ ఉంది. మ‌ళ్లీ ఈ రెండు సినిమాల మ‌ధ్య క్లాష్ వ‌చ్చే అవ‌కాశం ఏర్ప‌డింది.

పెద్ద సినిమాల‌న్నీ విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించుకుంటే.. రాధే శ్యామ్ నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌నా లేదు. మార్చి 4న ఈ సినిమాని విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ డేటు ప్ర‌స్తుతానికి ఖాళీ. అది.. రాధే శ్యామ్ కోస‌మే అని, ఈ డేట్ ని చిత్ర‌బృందం లాక్ చేసింద‌ని, ఏ క్ష‌ణంలో అయినా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో మ‌ళ్లీ కొత్త రిలీజ్ డేట్లు వ‌చ్చాయి. అయితే ఇవే ప‌క్కా డేట్లు అని చెప్ప‌లేం. ఏ ఒక్క‌రు అటూ ఇటూ వెళ్లినా, ఆ ప్ర‌భావం మిగిలిన అన్ని సినిమాల‌పైనా ప‌డుతుంది. ముఖ్యంగా ఆర్‌.ఆర్‌.ఆర్ అనుకున్న స‌మ‌యానికి రావాలి. లేదంటే.. ఈ రిలీజ్ డేట్ల పేక‌మేడ‌
చటుక్కున కూలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌పై గవర్నర్‌దే పైచేయి !

గవర్నర్‌పై ఆవేశంగా హైకోర్టుకెళ్లిన తెలంగాణ సర్కార్ చివరికి ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలని తెలుసుకుది. ఇంత కాలం గవర్నర్ విషయంలో చేస్తున్నదంతా తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చినట్లయింది. హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్...

వైసీపీ ఎమ్మెల్యే “అవినీతిలో నిజాయితీ” చూస్తే మైండ్ బ్లాంకే !

మేమేమి నీతి మంతులం కాదు.. అవినీతి చేయడం లేదని చెప్పడంలేదు.. కానీ తక్కువే చేస్తున్నాం... అని ఘనంగా ప్రకటించుకున్నారు.. ఓ వైసీపీ ఎమ్మెల్యే. తక్కువే అంటే ఎంత అనే డౌట్ ఇతరులకు...

ఆ ముసలాయన బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేదు: జగన్

యాభై ఏళ్లు దాటిన జగన్మనోహన్ రెడ్డి చంద్రబాబును ముసలాయన అని సంబోధించడం ప్రారంభించారు. చేదోడు పథకం కింద గట్టిగా నియోజకవర్గానికి రెండు వేల మందికి కూడా లబ్ది చేకూర్చని పథకానికి .. రూ.కోట్లు...

జ‌మున బ‌యోపిక్‌లో త‌మ‌న్నా?

ఓ అగ్ర తార చ‌నిపోయిన మ‌రుక్ష‌ణం.. బ‌యోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న వ‌స్తుందేమో..? ఈమ‌ధ్య అలానే జ‌రిగింది. ఇప్పుడు జమున విష‌యంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్ర‌సీమ‌. దాదాపు 200...

HOT NEWS

css.php
[X] Close
[X] Close