పుష్కర యాత్రికులకు కాపుగాస్తున్న ‘రిలయెన్స్ జియో’!

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘డిజిటల్ ఇండియా’ కాన్సెప్టు ”రిలయెన్స్ జియో” వేగాన్ని చూసి పుట్టిందా? మోదీ సాంకేతిక స్పృహను గమినించి జియో వేగం పెంచిందా అన్న మీమాంసను పక్కనపెడితే…లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్ (LTE) నెట్ వర్క్ మీద మొబైల్ ఫోనులకు నాలుగో జనరేషన్ (4G) వైర్ లెస్ సర్వీసులను, ఆప్టిక్ ఫైబర్ వైరుతో శక్తివంతమైన బ్రాడ్ బాండ్ సర్వీసులను ఇచ్చే రెండవ పెద్ద సర్వీసు ప్రొవైడర్ గా జియో నిలబడింది. ఈ సామర్ధ్యం కారణంగానే భారత ప్రభుత్వ ప్రాజెక్టు ‘డిజిటల్ ఇండియాకు’ పెద్ద ”బ్యాక్ బోన్” స్టేటస్ ను రిలయెన్స్ జియో అందుకుంటోంది. ఈ ఊపు కొనసాగితే దేశవాప్తంగా ఇంటర్ నెట్ వ్యాపారంలో సగం ‘జియో’ హస్తగతమౌతుంది.

గోదావరి పుష్కరాల్లో రిలయెన్స్ జియో రెండురకాల సేవలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా ఆప్టిక్ ఫైబర్ వైర్ తోకూడిన బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ రెండోదశ (BETA) టెస్టింగ్, వైర్ లెస్ విధానంలో మొబైల్ ఫోనులకు 4G తొలిదశ (ALFA) టెస్టింగ్ రాజమండ్రిలోనే చేస్తున్నారు. రాజమండ్రిలో 33 కలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ పాకించి 171 శక్తివంతమైన కెమేరాలకు కలిపి పోలీసు కంటో్రలు రూముకి అనుసంధానం చేశామని, లక్షలాది మంది యాత్రికుల కదలికలను 360 డిగ్రీల్లో, జూమ్ చేసి కూడా గమనించవచ్చని ఆసంస్ధ ప్రతినిధులు వివరించారు. ఇది అత్యంత విస్తృతమైన, ఖచ్చితమైన నిఘా, సహాయ వ్యవస్ధ అవుతుందన్నారు. భారతదేశంలో 171 నిఘా కెమెరాలను ఒకే చోట వినియోగించడం ఇదే మొదటిసారి అన్నారు.దేశంలో ఇప్పటికే 2లక్షల 50 వేల కిలో మీటర్ల ఫైబర్ ఆప్టిక్స్ లైన్లను లైన్లను వేసింది. అలాగే పుష్కరాలకాలంలో తమ నెట్ వర్క్ మొబైల్ ఫోన్ లకు ఉచితంగా 4G కనెక్టివిటీ ఇస్తున్నామన్నారు. అత్యంత వేగమైన డేటా నెట్ వర్క్, వీటి కోసం ప్రత్యేక పరికరాలు, వార్తలు, వినోదభరిత అంశాలు, ఇ నగదు చెల్లింపులు, వ్యాపార, ఆరోగ్యం, విద్య వంటి విషయాలపై మరిన్ని సదుపాయాలు జియో అందచేస్తుంది.

డిజిటల్ ఎకానమీ, ప్రపంచ ఆర్ధిక స్థితిలో డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించే ప్రయత్నంలో, గ్రామీణ ప్రాంతాలలో మరింత డిజిటల్ సాధికారతకు జియో కృషి చేస్తోంది. దేశంలోని అన్ని పాఠశాలలకు, బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని కలిగించి, వారి ద్వారా డిజిటల్ భారత వికాసానికి, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం సమగ్రాభివృద్ధికి ప్రత్యేక అంశాలను రకరకాల ‘యాప్స్’ పొందుపరుస్తోంది. ఇంత పెద్ద క్లిష్టమైన నెట్ వర్క్ ను వాణిజ్య పరమైన వినియోగం లోకి తెచ్చే ముందు అవసరమైన ఆల్ఫా, బీటా పరీక్షలను ప్రస్తుతం జియో నిర్వహిస్తోంది. ఇందుకు పుష్కరాలు కూడా దోహదమౌతున్నాయి. ఇంతటి భారీ ఈవెంటుపై అత్యాధునిక ఐటి సేవలు ప్రభుత్వానికి, సవాళ్ళతో కూడిన ప్రతిష్ట రిలయెన్స్ జియోకి దక్కుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close