ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ఒక్క రేణువు బయటకు పోవడానికి లేదని చెప్పి ఆపేశారు. నాలుగైదు నెలలు అలా ఉంచి.. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. తర్వాత కొత్త విధానం తెచ్చి.. దోచుకోవడం ప్రారంభించారు. కింది స్థాయిలో ఎవరు ఎంత దోచుకున్నా.. సిండికేట్ కా సాయంత్రానికి తమకు లెక్కలు చెప్పాల్సిందేనని జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టేశారు. గత ఐదేళ్లగా ఏపీలో ఇసుక పేరుతో జరిగిన దందాను గుర్తు చేుకుంటే.. వీళ్లు పాలకులా.. ఇసుకాసురాలా అని ఆశ్చర్యోవాల్సిందే.

ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ తవ్వేశారు. గుట్టలు గుట్టలుగా పోశారు. ఇసుక కోసం నదిలో నుంచి రోడ్లు వేశారు. డ్యాముల దగ్గర మొత్తం తవ్వేసి డ్యాములు కుప్పకూలిపోయేలా చేశారు. ఈ ఇసుక అంతా ఎటు పోయింది ?. దగ్గర్లో ఉన్న నగరాలకు తరలి పోయింది. అటు హైదరాబాద్ ఇటు బెంగళూరు..మరో వైపు చెన్నై. వాళ్లకు కావాల్సిన ఇసుకంత మన దగ్గర నుంచే. మరి మన ప్రజలకు ఏం ఇచ్చారు ?. చిప్ప చేతికి ఇచ్చారు. ఇసుక ధర భరించలేక ఇళ్లు కట్టుకోలేకపోయిన వారు ఎందరో.. సరైన ఇసుక దొరక్క ఇచ్చించే ఇసుక అనుకునే పరిస్థితి. 2019కి ముందు రవాణా చార్జీలే ఇసుక ధర. ఇప్పుడు రవాణా చార్జీలు అదనం.. ఓ లారీ 50వేలుపైనే. ఇంత భారీ దోపిడీ చేసిన దానికి సాక్ష్యాలేమ లేకుండా పూర్తిగా నగదు లావాదేవీలే నిర్వహించారు.

ఏపీలో ఇసుక మాఫియా ఎలా చెలరేగిపోయిందంటే చివరికి ఎన్జీటీ , సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. జరిమానాలు , ఆరమని ఆదేశాలు ఇచ్చారు. మా రాజ్యాంగంలో ఎన్జీటీ, సుుప్రీంకోర్టులకు విలువ లేదని ప్రభుత్వ పెద్దలు దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నారు. గత వారం కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులులేని రీచ్‌లలో తవ్వకాలు ఆపేయాలని అనుమతులు ఉన్నచోట్ల యంత్రాలతో తవ్వకూడదని ఆదేశించింది. కానీ భారత అత్యున్నత న్యాయస్థానానికి ఏపీలో విలువ ఎక్కడుంది.. వారిచ్చే ఆదేశాలను పాటించే యంత్రాంగం ఎక్కడ ఉంది. ఎవరికి దొరికింది వాళ్లు దోచుకునే పనిలోనే ఉన్నారు. అదే జరుగుతోంది.

పాలకుల కక్కర్తి వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినింది. నిర్మాణ పనులు చేసుకునే వారికి సమస్యలు ఎదురయ్యాయి. ఉపాధికి దెబ్బ పడింది. అయినా పాలకులకు ఇసుక రేవణువంత కనికరం కూడా లేదు. ఇసుక దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మరో సారి ఓటేస్తే.. ఇసుకపై తమకే అధికారం అని చట్టం చేసుకుంటారు. పర్యావరణం అనేది అభూతకల్పన అని చేయాలనుకున్నది చేసేస్తారు. ఏం చేసుకుంటే ఏందిలో మాకో వెయ్యి ఇస్తారని అనుకుంటే.. మీకు తెలియకుండానే లక్షలు నష్టపోతారు. అందుకే ఓటేసే ముందు ఇసుక మాఫియాను అంతం చేయాలని కృతనిశ్చయానికి రండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close