పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం జాని. దర్శకుడు కావాలనుకున్న కలను ఈ సినిమాతో తీర్చుకున్నారు పవర్ స్టార్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులు రుచించలేదు. పవన్ కళ్యాణ్ ఈమెజ్ కు అస్సల్ సెట్ కాని ఈ సినిమా, బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. కాని సినిమాని సినిమాగా చూసే కొందరికి మాత్రం జానిలో కొన్ని సన్నివేషాలు నచ్చాయి. ఇప్పటికీ కొంతమంది పవన్ నటించిన చిత్రాల్లో ఇష్టమైన సినిమా ఏది అంటే జాని అనిచెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఇదే సమాధానం ఇచ్చారు.
తాజగా ఓ ఛానల్ తో మాట్లాడిన రేణు.. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తారు? అనే ప్రశ్నకు మరోఆలోచన లేకుండా ”జాని” అని రిప్లయ్ ఇచ్చారు. ”జాని సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కాని నాకు చాలా ఇష్టమైన సినిమా అది. నిజానికి మీరు చూసిన జానీ వేరు. కళ్యాణ్ గారు రాసుకున్న జానీ వేరు. ఒరిజినల్ స్క్రిప్ట్ చాలా మందికి తెలియదు. ఒరిజినల్ స్క్రిప్ట్ నాకు తెలుసు. చాలా హార్ట్ టచింగ్ గా ఉటుంది. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం అయితే జాని చనిపోతాడు. ఆ ఎపిసోడ్ మాములుగా వుండదు. నిజంగా కళ్యాణ్ గారు మొదట రాసుకున్నట్లు తీసుంటే హృదయాన్ని కరిగించే లవ్ స్టోరీ అయ్యిండేది. కాని తప్పని పరిస్థితిలో కొన్ని మార్పులు చేయాల్సివచ్చింది. కాని ఇప్పుడు ఆ అవకాశం వస్తే మాత్రం కళ్యాణ్ గారు రాసుకున్న ఒరిజినల్ స్క్రిప్ట్ తీస్తా” అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు రేణు.