మీడియా వాచ్ : రిపబ్లిక్ టీవీవి ఫేక్ రేటింగ్స్..!

ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ చూస్తున్న వారిలో సగం మంది మా టీవీ చానలే చూస్తున్నారని ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఘనంగా ప్రకటించుకుంది. సాక్ష్యంగా బార్క్ రేటింగ్స్‌ను జత చేసింది. అయితే.. ఇప్పుడే అసలు ట్వస్ట్ వెలుగులోకి వచ్చింది. రేటింగ్స్‌ను ట్యాంపర్ చేస్తున్నారంటూ.. బార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు .., రిపబ్లిక్ టీవీ.. సుశాంత్ సింగ్ కేసులో విచారణ చేస్తున్న దాని కన్న వేగంగా పరిశోధించి… రిపబ్లిక్ టీవీవి మొత్తం ఫేక్ రేటింగ్స్ అని తేల్చేశారు. అంతే కాదు.. ఈ టాంపరింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు పెట్టేశారు.

రిపబ్లిక్ టీవీకి చెందిన ముషులు… టీవీ మీటర్ రీడింగ్ ఉన్న ఇళ్లను గుర్తించి.. డబ్బులిచ్చి, తమ ఛానల్‌ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్నారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠీ చానళ్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిలో బార్క్‌ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ స్కాం ఆర్నాబ్ గోస్వామి చుట్టూ తిరుగుతోంది. ఆయన ఈ స్కాంలో పాత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. రేపో మాపో ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ రేటింగ్స్ స్కాం బయటకు రావడానికి ఆర్నాబ్ గోస్వామి..మహారాష్ట్ర ప్రభుత్వంపై కొద్ది రోజులుగా విస్తృతంగా కథనాలు ప్రసారం చేయడమే కారణంగా అనుమానిస్తున్నారు. గతంలో ఆయన చానల్ లావాదేవీలకు సంబంధించి కొన్నాళ్లు విచారణకు పిలిచారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆర్నాబ్ రిలీఫ్ పొందారు. బార్క్ విషయంలో మాత్రం.. ఆయన బయటపడటం కష్టమన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close