అక్కడ సౌండ్ చేస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోందేమిటబ్బా?

ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో రాజకీయాలు భలేగా సాగుతున్నాయి. ఒక రాష్ట్రంలో మ్రోగే రాజకీయ శబ్దాలు మరొక రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆంధ్రాలో తెదేపా ప్రభుత్వం కూడా తెరాస ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కనుక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏమి మాట్లాడినా అది పొరుగు రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తోంది. ఏమి చేసినా అది పొరుగు రాష్ట్రంలో చర్చింపబడుతోంది. రాష్ట్రం విడిపోయాక రాజకీయాలు కూడా విడిపోతాయనుకొంటే అవి ఇంకా దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఉదారణకి తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా హన్మకొండలో ప్రచారం చేస్తూ తెరాసపై చేసిన విమర్శలన్నీ ఆంధ్రప్రదేశ్ లో తమ తెదేపాకు అక్షరాల వర్తింపజేసుకోవచ్చును. ఆయన ఏమన్నారంటే “తెరాస అంతా ఇప్పుడు తెలంగాణా ద్రోహులు, కబ్జాదారులతో నిండిపోయింది. ఆ పార్టీలో ప్రజలకు సేవ చేయాలనుకొనే నాయకులే కరువయ్యారు. జీవిత కాలం ప్రత్యర్దులయిన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా మురళి ఇప్పుడు ఒకే పార్టీలో చేరి ఎలాగ పనిచేస్తారు?” అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఆయన మాటలనే ఏపిలో తెదేపాకు వర్తింపజేసి చూసుకొన్నట్లయితే, దొంగల పార్టీగా అభివర్ణించిన వైకాపా నుండే ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యేలను తెచ్చుకొంటోంది. అందుకు ఒక్కొక్కరికీ రూ.20కోట్లు కూడా చెల్లిస్తోందని వైకాపా నేత అంబటి రాంబాబు చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇసుక మాఫియా, రాజధాని భూముల బినామీ కొనుగోళ్ళపై వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమనుకొన్నట్లయితే తెదేపాలో కూడా ప్రజలకు సేవ చేసేవాళ్ళే కరువయ్యారని చెప్పుకోవలసి ఉంటుంది.

ఇక ఒకే నియోజక వర్గానికి చెందిన జీవితకాల శతృవులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తెదేపాలో ఉన్నారు. ఆలాగే ఆనం సోదరులు, జేసి బ్రదర్స్, గంటా శ్రీనివాసరావు తదితరులు వారి బద్ధ శత్రువులు అందరూ కూడా తెదేపాలో ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలనే ఏపిలో వైకాపా అడగవచ్చును. ఏపిలో వైకాపా నేతలు తెదేపాపై చేస్తున్న ఆరోపణలనే తెలంగాణాలో తెదేపా, కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వాన్ని అడగవచ్చును.

ఈవిధంగా రెండు రాష్ట్రాలలో రాజకీయాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములలాగ కలిసుందామని ఇదివరకు తెరాస నేతలు చెప్పేవారు. కానీ దానినే కొంచెం మార్చి చెప్పుకొంటే రాష్ట్రాలుగా విడిపోయినా రాజకీయంగా కలిసుందామని చెప్పుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close