టీటీడీలో చిచ్చుపెడుతున్న వైవీ మార్క్ పాలన ..!

అవినీతిని కడిగేస్తామంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి… ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ పై తాజాగా.. టీటీడీ చైర్మన్ బురద చల్లినంత పని చేశారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిపై.. ఎస్‌ఐ స్థాయి అధికారిని విచారణకు పంపించింది. ఇది తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఢిల్లీలో టీటీడీకి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన వ్యవహారాల కోసం.. ఢిల్లీలో. .. టీటీడీ లోకల్ ఎడ్వయిజరీ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా .. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఉంటారు. ఈ కమిటీ రూ. నాలుగైదు కోట్లు .. గోల్ మాల్ చేసిందనే ఆరోపణలను ఆకాశరామన్న పేరుతో కొంత మంది టీటీడీకి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుల పైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు జరిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరించారని .. రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు తీసుకుని ఆకాశరామన్న పేరుతో టీటీడీకి కొంత మంది వ్యక్తులు ఫిర్యాదులు చేశారు. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని లేఖలు రాశారు. ఈ లేఖలపై.. గత ప్రభుత్వ హయాంలోనే విచారణ జరిగింది. కానీ ఏమీ తేలకపోవడంతో.. అది ఆగిపోయింది.

టీటీడీకి కొత్త చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆ పాత ఫిర్యాదును బయటకు తీసి… కొత్తగా విచారణ చేయమని.. ఓ ఎస్ఐ స్థాయి అధికారిని ఢిల్లీకి పంపారు. దీంతోనే వివాదం ప్రారంభమయింది. ఏపీ భవన్‌ను.. టీటీడీ తీవ్రంగా అవమానిస్తోందని రెసిడెంట్ కమిషనర్… భావించారు. ఏపీ భవన్ సిబ్బంది కూడా.. రికార్డుల తనిఖీకి పెద్దగా సహకరించలేదుని చెబుతున్నారు. చివరికి లోకల్ ఎడ్వయిజరీ కమిటీ చైర్మన్ పదవికి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు.. టీటీడీ వైఖరి ఏపీ భవన్‌ విలువ తగ్గించేలా ఉందని మండిపడ్డారు. టీటీడీ వైఖరిని నిరసించారు. ఈ వ్యవహారం ఢిల్లీ అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close