రిటైర్మెంట్ హోమ్స్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. రిటైరయ్యేవారు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు సొంత ఊళ్లకు వెళ్లిపోయి అక్కడ స్థిరపడాలనుకునేవారు తక్కువ. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వారు అనువైన ఇళ్లను వెదుక్కుంటున్నారు. వాటికి డిమాండ్ పెరుగుతూండటంతో అలాంటి ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి.
రిటైర్మెంట్ హోమ్స్ తీసుకునే విషయంలో కొన్ని విషయాలను అంచనా వేసుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్య సదుపాయాలను మొదటి ప్రయారిటీగా తీసుకోవాలని చెబుతున్నారు. అందుబాటులో నర్సులు, డాక్టర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే ప్రాంతాలకు సమీపంలో ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. అలాగే ఇళ్లు యాంటీ-స్లిప్ ఫ్లోరింగ్, గ్రాబ్ బార్స్, వీల్‌చైర్ ఫ్రెండ్లీ వంటి నిర్మాణ ప్రమాణాలు పాటించాలి. సింగిల్, డబుల్, లేదా షేర్డ్ రూమ్‌లు, డీలక్స్ కాటేజ్‌ల రూపంలో ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నారు.
రిటైర్మెంట్ హోమ్స్ ధరలు సాధారణ ఇళ్లతోపోలిస్తే తక్కువగానే ఉంటాయి. పెద్దవి అవసరం ఉండదు కాబట్టి నిర్వహణ సులువుగా ఉండే చిన్న ఇళ్లనే నిర్మిస్తారు. ాకనీ ఇతర సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాలుష్య రహితమైన, పచ్చని ప్రాంతంగా ఉండటం వల్ల రిటైర్మెంట్ హోమ్స్‌కు అనువైన ప్రదేశం. కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రత్యేకంగా రిటైర్మెంట్ హోమ్ ప్రాజెక్టులను నిర్మించి అమ్ముతున్నాయి.