కేటీఆర్ మాటలకు రేవంత్ చేతల కౌంటర్ !

కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కేటీఆర్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు… పార్టీ నేతలతో అనిపిస్తున్న కామెంట్స్ కు రేవంత్ రెడ్డి వయోలెంట్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యట నుంచి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. అంతకు ముందే వారు ఇంటలిజెన్స్ చీఫ్ శివనాథ్ రెడ్డిని కూడా కలిశారు. తమకు ఏ ఉద్దేశాలు లేవని ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రకటించారు. కానీ అసలు ఉద్దేశమేంటో వారికీ తెలుసు.

కాంగ్రెస్‌కు తెలుసు.. బీఆర్ఎస్ నేతలకూ తెలుసు. ఇలా కలిసిన వారిలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో .. సిగ్నల్స్ పంపినట్లయిందని అంచనా వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకున్నారు. తనకు ఉన్నది నలుగురు ఎమ్మెల్యేల మెజార్టీనేనని ఆయనకు తెలుసు. ప్రభుత్వాన్ని కాపాడు కోవాలంటే ఏం చేయాలో ఆయన ముందుగానే లెక్కలేసుకున్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రభుత్వాలకు సంబంధించిన కేస్ స్టడీల్ని పరిశీలించిన తరవాత ఇంటలిజెన్స్ ను ముందుగానే కార్యాచరణలోకి దించినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని బెదిరించడానికో లేకపోతే తమ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడానికో కానీ.. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

ఈ రాజకీయ వ్యూహం రివర్స్ అవుతుందని ఎక్కువ మందికి తెలుసు. అయినా కేటీఆర్ మాత్రం అదే వ్యూహం బెటరని అనుకుంటున్నారు. ప్రజలు తమను తిరస్కరించాలంటే కేటీఆర్ నమ్మలేక పోతున్నారని… త్వరలోనే తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అనుకుంటున్నారని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలతో కేటీఆర్‌కు క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలంటన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close