జగన్‌తో ఒప్పందం చేసుకుని తెలంగాణకు కేసీఆర్ అన్యాయం : రేవంత్

ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించారని నీటి సమస్యలు వస్తాయని హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై ఆయన భాషలో తిట్లందుకున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ గతంలో పోతిరెడ్డి పాడు నుంచి వైఎస్సార్ నీటిని తరలించుకోయారన్నారు. ఆ తర్వాత జగన్.. కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిని కృష్ణా నీటిపై 6 గంటలు చర్చించారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి కేసీఆర్ దగ్గర అనుమతి తీసుకున్నారని.. ఆ జీవో 2020లో ఆమోదం పొందిందన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగి పోయిందన్నారు. తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ పోలీసుల్ని పంపి ఆక్రమించుకుంటే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని సీఎం జగన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ చేసారు.

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్‌లు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్‌పై నెట్టివేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పిందన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పిందని అన్నారు. ఫిబ్రవరి 2 , 2014 నాడు ఆమోదం జరిగిన సమయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు.

పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగే రాశారని కేసీఆర్ అన్నారన్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయానికి కేసీఆర్ పునాదిరాయి వేశారని మండిపడ్డారు. ఈ చట్టానికి కేసీఆర్ పార్టీ ఓట్లేసి మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఈ చట్టానికి బాధ్యత కేసీఆర్, కేశవరావులదేనని అన్నారు. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించిన తర్వాతే.. 2015 జూన్ 18,19 తేదీలల్లో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 వాడుకోవాలని ఒప్పందం చేశారని తెలిపారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని హరీష్ రావు సంతకం పెట్టారన్నారు. నీటి పంపకాల్లో 50 శాతం వాటా గత ప్రభుత్వం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హక్కుల ప్రకారం 68 శాతం ప్రకారం 500 టీఎంసీలు పైగా తెలంగాణకు రావాలని స్పష్టం చేశారు. తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఇంజనీర్ మురళీధర్ రావు ఈ నిర్ణయంపై సంతకాలు పెట్టారని రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లు చూపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close