తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ లేకుండా.. ఫుల్ సెక్యరిటీ లేకుండా .. ఆకస్మికంగా హైదరాబాద్ లో పర్యటించారు. భారీ వరదల కారణంగా నగరంలో పలు చోట్ల నీళ్లు నిలిచిపోతున్నాయి. ఇలాంటి కాలనీలను ఆయన పరిశీలించారు. అమీర్ పేట వద్ద ఈ మధ్యకాలంలో వర్షం పడితే నాలుగు అడుగుల మేర నీరు నిలబడుతోంది. మైత్రీవనం, బుద్దనగర్, గంగూబాయి బస్తీ వంటి చోట్లకు స్వయంగా వెళ్లారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సీఎం వెంట ఉన్నారు. ఆయనతో .. ముంపు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్పటికప్పుడు చర్చించారు.
హైదరాబాద్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్పారు. మరోసారి క్లౌడ్ బరస్ట్ అయ్యే చాన్స్ ఉందనిచెప్పడంతో. రేవంత్ కూడా సమస్యలు రాకుండా తాత్కాలికంగా అయినా తీసుకోవాల్సినచర్యలపై దృష్టి సారించారు. ఆగస్టు నెల అంతా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పధ్నాలుగు నుంచి పదిహేడు వరకు.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను రేవంత్ పరిశీలిస్తున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు వరద నీరు పోవడానికి నాలాలు.. ఇతర మార్గాలను మెరుగుపరిచారు. దాని వల్ల వర్షం ముగిసిన కొంత సేపటికి రోడ్లు క్రియర్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఊహించనంత భారీ వర్షం పడినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ, నాలాలు తట్టుకోలేనప్పుడు రోడ్డుపై కొంత సమయం నీళ్లు నిలబడటం సహజమేనని.. ఎంత త్వరగా వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిస్తే అంత త్వరగా రోడ్లపై నీరు క్లియర్ అవుతాయని అంటున్నారు.