కేసీఆర్ స్టైల్లోనే రేవంత్ ఎదురుదాడి – ఇక దూకుడే !

రేవంత్ రెడ్డి గత రెండు, మూడు రోజులుగా మారిపోయారు. ఆయన మాటలు పాత రేవంత్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నాయి. ఇంద్రవెల్లిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారభేరీ సభలో ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిపై ఘాటు భాషలో విరుచుకుపడ్డారు. పండబెట్టి తొక్కుతామని కట్టేసికొడతామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో రేవంత్ సంయమనంతో వ్యవహరిస్తూండటంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ మనుగడపై ఎక్కువ కామెంట్లు చేస్తున్నారు. దీంతో రేవంత్ మాటలతోనే ఎదురుదాడికి దిగారు.

తాజాగా ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జరుగుతున్న వివాదంలో.. తప్పంతా బీఆర్ఎస్ చేసి..ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడంతో రేవంత్ ఆవేశంతో ఊగిపోయారు. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ వాడిని అత్యంత బూతుపదాలతోనే విరుచుకుపడ్డారు. రేవంత్ మాట్లాడిన మాటలు సమర్థనీయమా కాదా అన్న సంగతి కంటే.. గతంలో కేసీఆర్ అన్న మాటలేగా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. రాజకీయాల్లో మనం ఏది చేస్తే అది రివర్స్ వస్తుందని… తామే కింగులమని ఎవరికీ చాన్స్ రాదని విర్రవీగితే ఇలాంటి పరిస్థితి వస్తుందని సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవారు. ఇప్పుడు ఆయన మాటలు పడాల్సి వస్తోంది. దీనికి బీఆర్ఎస్ వద్ద సమాధానం ఉండే అవకాశం లేదు.

సబ్జెక్ట్ విషయంలోనూ రేవంత్ రెడ్డి సూటిగా ఉంటున్నారు. ప్రాజెక్టుల్ని అప్పగించించి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పత్రాలతో సహా బయటపెట్టారు. ఎన్నికల్లో లబ్ది కోసం సాగర్ ప్రాజెక్టుపై పైకి ఏపీ పోలీసులు వచ్చేలా కుట్ర చేసింది కూడా కేసీఆర్, జగన్ రెడ్డేనని.. . రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. చేయాల్సినదంతా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై నిందలేయడంపై రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో నల్లగొండలో సభ పెట్టాలనుకుంటున్న బీఆర్ఎస్‌కు అంతకు ముందే గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తన సహజశైలికి భిన్నంగా ఉంటున్నారు. కానీ రెండు నెలల్లోనే ఆయనను పాత రేవంత్ రెడ్డిని చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన చేతిలో అధికారం ఉంది. రేవంత్ ను తట్టుకోగలరా అన్నదే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ నేతల ముందున్న ప్రశ్న

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close