కారు నుంచి చేరికల్లో జోరు పెంచుతున్న రేవంత్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌లో ఎవరు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించి వారిని ఠక్కున పిలిచి కండువాలు కప్పడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల్లోనే టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా కొంత మందిపేర్లు వినిపిస్తున్నాయి. ఓవర్ లోడ్ అయిన టీఆర్ఎస్‌కు ఇతర పార్టీల్లో అవకాశాలు కనిపిస్తున్న ఇతరుల్ని బుజ్జగించిపార్టీలో ఉంచడం కష్టమే.

ఇలాంటి పరిస్థితుల్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు చేరికల విషయంలో వ్యూహాత్మకంగా లేరు. ఒకరు చేరికలకు చర్చలు జరిపితే.. ఇంకొకరు వెనక్కి లాగుతున్నారు. వర్గాలుగా మారిపోయారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీలో చేరాలనుకున్నారు. కానీ ఆయనకు అక్కడ పరిస్థితి అర్థమయ్యే సరికి రేవంత్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారు. అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. టీఆర్ఎస్‌కు ప్రస్తుతం మరీ అంత పాజిటివ్ వేవ్ లేదు. అలాగని ఇతర పార్టీలకు ఏకపక్షంగా లేదు.

కానీ ఇలాంటి చేరికల ద్వారానే పాజిటివ్ వేవ్ వస్తుంది. రేవంత్ రెడ్డి దాన్ని వ్యూహాత్మకంగా తీసుకు వస్తున్నారు . టీఆర్ఎస్ నేతలు వరుసగా కారు దిగిపోతున్నారంటే.. అది ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఈ విషయంలో రేవంత్ పైచేయి సాధిస్తున్నారు. ప్రచారంలో ఉన్న వారిలో సగంమందికి కాంగ్రెస్ కండువా కప్పినా పార్టీకి ఊపు వచ్చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close