“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త ఇబ్బందుల్లో పెట్టారు. ఎన్జీటీ నుంచి విచారణ ఆదేశాలు వచ్చేలా చేసి.. తాను కూడా ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు.. ఆ విచారణ ఆపడానికి కేటీఆర్ స్టేలు తెచ్చుకున్నారు. దాంతో.. టీఆర్ఎస్ సమర్థించుకోలేని పరిస్థితికి వెళ్లిపోయింది. తాజాగా రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన విరాళాలపై గురి పెట్టారు. ఆ విరాళాలను ఎవరెవరు ఇచ్చారు..? ఏమేమి ఇచ్చారు..? ఎలా ఖర్చు పెట్టారో.. విజిలెన్స్‌తో విచారణ జరిపించాలంటూ.. నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మోడీకి లేఖ రాశారు.

కరోనా లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత.. విరాళాల ఉద్యమం నడిచింది. కేంద్రంలో పీఎం కేర్స్ పేరిట ఓ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఇలాంటి ఫండ్స్‌ను ఏర్పాటు చేయకపోయినా… సీఎం రిలీఫ్ ఫండ్లకు విరాళాలు ఇవ్వాలన్న సూచనలు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ప్రధాన వ్యాపార వాణిజ్య వేత్తలందరూ.. రెండు రాష్ట్రాలకూ విరాళాలు ప్రకటించుకున్నారు. స్వయంగా ఇచ్చిన వారు ఉన్నారు. ఆయా ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసిన వారు ఉన్నారు. ఏపీలో అయినా.. నియోజకవర్గ స్థాయి అధికార పార్టీ నేతలకు రూ. కోటి టార్గెట్ ఇచ్చారని కూడా చెప్పుకున్నారు. ఇప్పటికీ కొంత మంది సేకరించి ఇస్తూనే ఉన్నారు. తెలంగాణలో మాత్రం.. ఇలా ప్రజల నుంచి సేకరించలేదు కానీ… కార్పొరేట్ సంస్థలు మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చాయి. వీటిని ఎలా ఉపయోగించారో బయటకు తేలాలని.. రేవంత్ రెడ్డి అంటున్నారు.

నిధుల దుర్వినియోగం జరిగిందని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. తన లేఖలో రేవంత్ అదే చెబుతున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ నిర్వహించి.. దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సర్కార్‌పై కోవిడ్ నియంత్రణ చర్యల విషయంలో తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విరాళాలు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. రేవంత్ కేంద్రానికి ఫిర్యాదు పంపారు. బీజేపీ కూడా కేసీఆర్ తీరుపై అసహనంగా ఉంది. ఒక వేళ విచారణ అంటూ జరిపితే.. రేవంత్ మరోసారి స్కోర్ చేసినట్లే అవుతుంది. అయితే.. దానికి అవకాశాలు చాలా తక్కువన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close