క్యాడర్‌కు కాంపిటిషన్ పెట్టిన రేవంత్ రెడ్డి !

పదేళ్ల తర్వాత వచ్చిన అధికారంలో భాగం అవ్వాలంటే… కొన్ని లక్ష్యాలు సాధించాలని క్యాడర్ కు రేవంత్ రెడ్డిపోటీ పెడుతున్నారు. వచ్చే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అందులో పార్టీ తరపున అభ్యర్థిత్వాలు దక్కించుకోవాలంటే తమ తమ ప్రాంతంలోకాంగ్రెస్ కు మెజార్టీ చూపించాల్సిందేనని అంటున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బూత్‌లో మోజార్టీని బట్టి టిక్కెట్లు ఇస్తామని నిర్ణయించారు.

అదే సమయంలో రేవంత్ రెడ్డి పథకాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఇందిరమ్మ కమిటీలను కాంగ్రెస్ క్యాడర్ తో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో ప్రతి సభ్యుడికి రూ. 6వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ రకంగా వాలంటీర్లు లాగే. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. తర్వాత ప్రతి 35 ఇళ్లకు ఒకరుచొప్పున సాధికార మిత్రల్ని నియమించారు. కానీ వాలంటీర్ల అంత ఫోర్స్ గా కుటుంబాలను బెదిరించేలా వ్యవస్థని తీర్చిదిద్దలేదు.

ఇప్పుడు రేవంత్ ఇందిరమ్మ కమిటీలను ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు కానీ.. వాటిని మాత్రం… క్రియాశీలం చేయాలనుకుంటున్నారు. పథకాలను ప్రతి ఇంటికి చేర్చి.. రాజకీయంగా లబ్ది పొందాలనే ఆలోచన అన్ని పార్టీలకూ ఉంటుంది. కానీ ఇలా ఏర్పాటు చేసే వ్యవస్థలే ఆయా పార్టీలకు మైనస్ గా మారుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close