సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే… గుప్త నిధుల తవ్వకాల విషయం తెలిసిందని.. అంటున్నారు. సచివాలయం భవనాల్లో జీ బ్లాక్ అత్యంత పురాతనమైనది. దాన్ని నిజాం రాజు నిర్మించారని చెబుతూంటారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. రేవంత్ ఇప్పుడా అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. నమస్తే తెలంగాణ పత్రికలో గతంలో.. ఈ అంశంపై కథనాలు వచ్చాయి. వాటినే.. మీడియాకు చూపించారు రేవంత్.

కొన్నేళ్ల కిందట… సచివాలయానికి సమీపంలో ఉండే.. విద్యారణ్య స్కూల్ తవ్వకాల్లో.. ఓ సొంరంగం బయటపడింది. ఆ తర్వాత మింట్ కాంపౌండ్, హోం సైన్స్ కాలేజీల్లోనూ ఇలాంటి సొరంగాలు బయటపడ్డాయి. అవి ఎక్కడికి దారి తీస్తాయన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. కొన్నాళ్లు పాటు తవ్వకాలు కూడా జరిగాయి. అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసింది. ఆది ఏమయిందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్.. గుప్త నిధుల కోణం తీసుకు రావడంతో… పాత విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి జరుగుతాయని.. కూల్చివేత పనులు అర్థరాత్రి ప్రారంభమవడాన్ని గుర్తు చేశారు. పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఎందుకు తవ్వకాలు జరపడం లేదని .. పొక్రాన్ అణు పరీక్షలుు కూడా ఇంత రహస్యంగా జరపలేదని సెటైర్ వేశారు. జి బ్లాక్ కింద ఎన్ఎండీసీ, పురావస్తు శాఖ చేత తవ్వకాలు జరిపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి.. ఇప్పటికే పర్యావరణ కోణంలో ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఇప్పుడు పురావస్తు శాఖను ఇన్వాల్వ్ చేసేందుకు గుర్త నిధుల కోణం తీసుకు వస్తున్నారు. రేవంత్ వ్యూహాలను తిప్పికొచ్చడం.. టీఆర్ఎస్ నేతలకు.., ఇబ్బందికరమైన అంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close