జిల్లాలను తగ్గిస్తామన్న రేవంత్ – బీఆర్ఎస్‌కు చాన్సిచ్చినట్లే !

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని, జిల్లాల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామన్నారు.

తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదనేది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. 33 జిల్లాలు ఏర్పాటుచేసిన గత సీఎం కేసీఆర్ జిల్లాల పేర్లు కూడా చెప్పలేరంటున్నారు. కొన్ని జిల్లాల్లో ముగ్గురు నలుగురు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నారని .. జడ్పీ సమావేశం నిర్వహిస్తే వేదికపై ఉండేవారు తప్ప కింద ఉండే వారు లేరని విమర్శలు గుప్పించారు. అందుకే జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామని, దీనికోసం జ్యూడిషియల్ కమిషన్ నియమించి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

సీఎం రేవంత్ చెప్పింది అక్షరాలా నిజం. జిల్లాలు అతి చిన్నగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ జిల్లాల ను ముట్టుకుంటే రాజకీయ ఉద్యమాలు వస్తాయి. జిల్లాలను తగ్గిస్తే ప్రజలు ఒప్పుకుంటారా అని కేటీఆర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే.. జిల్లాల ఏర్పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. పూర్తిగా రాజకీయ డిమాండ్లతోనే జరిగింది. కృత్రిమ ఉద్యమాలు చేయించి జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తే అలాంటి ఉద్యమాలు మళ్లీ జరిగే అవకాశం కూడా ఉంది.

జిల్లాలు రాజకీయాల కోసం కాకుండా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి పని పూర్తి చేస్తే ప్రయోజనం ఉంటుంది ..లేకపోతే వివాదంతో గెలుక్కున్నట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close