రేవంత్ రెడ్డిని రాజకీయంలో గెలవడం అంత ఈజీ కాదని చాలా సింపుల్ గా మరోసారి నిరూపించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనపై అసంతృప్తితో ఉందని.. బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని.. ఫోటోలు కూడా దిగడం లేదని .. పలుకుబడి అంతా పోయిందని సంబరపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని కొంత మంది రేవంత్ వ్యతిరేకులు కూడా అదే అనుకుంటున్నారు. ఇటీవల రేవంత్ ను మార్చడానికి హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేసిందన్న ప్రచారమూ జరిగింది. కానీ అవన్నీ రాజకీయంలో భాగమేనని .. రేవంత్ పట్టు ఏ మాత్రం తగ్గదని.. తగ్గకుండా చూసుకుంటారని మరోసారి నిరూపించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీ అద్భుతంగా చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికే ఇచ్చారు. రేవంత్ రెడ్డితో సమావేశానికి రాహుల్ ఇష్టడటం లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. కానీ ఢిల్లీలో జరిగింది వేరు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన విధేయతా ప్రదర్శనకు ఏ మాత్రం తగ్గలేదు. రాహుల్, ప్రియాంక ల ముందు తనకు సోనియాపై ఉన్న విధేయతను చూపించారు. ఆమె నుంచి వచ్చిన లేఖ తనకు ఆస్కార్, నోబెల్ కంటే ఎక్కువ అని.. చెప్పి వారి మనసుల్ని గెల్చుకున్నారు. తర్వాత రేవంత్ కు..రాహుల్ ప్రత్యేకంగా లేచి నిలబడి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయనకు పాలనా పరంగా బాధ్యతలు ఉంటాయి. కేంద్రం నుంచి సహకారం అవసరం. అందు కోసం కేంద్రంతో ఆయన సంప్రదింపులు ఎక్కువగానే ఉన్నాయి. ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. పాలనా పరంగా… కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు తక్కువ. రాజకీయంగా మాత్రం బీజేపీని వదిలి పెట్టడం లేదు. అయినా పాలనా పరంగా చొరవ తీసుకుంటూ ఉండటంతో ఆయన బీజేపీ దారిలోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు.
కానీ ఏం చేసినా..దాన్ని సరైన విధంగా మలచుకోవడం ఎలాగో తనకు తెలుసని రేవంత్ నిరూపించారు. హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని.. ఆశలు పెట్టుకున్న వారు ఇక.. ఆశలు వదిలేసుకుని రేవంత్ దారిలో నడిస్తే.. వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చేశారు. అందుకే దటీజ్ రేవంత్ అనుకోవాలి.