ప్రభుత్వాన్ని పడగొడతానంటే కట్టేసి కొడతాం : రేవంత్

ప్రభుత్వం ఆరు నెలలే ఉంటుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మొదటి సారి రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్టయ్యారు. పండబెట్టి తొక్కుతాం.. కట్టేసి కొడతామని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో భారీగా జన సమీకరణ నిర్వహించి .. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామని హెచ్చరించారు.

ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బీఆర్ఎస్ జంపింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ నిత్యానందలాగా దేశం నుంచి పారిపోయి ఓ దీవిని కొనుక్కుని రాజుగా ప్రకటించుకోవాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ ఇక ముఖ్యమంత్రి కాదు కదా కనీసం మంత్రి కూడా కాలేడని స్పష్టం చేశారు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని మండిపడ్డారు. పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో రియాక్ట్ కావడంతో .. బీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన రాజకీయాలు ఉంటాయన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close