కేసీఆర్ ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్ లాంటోడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్.. ఎక్స్ పైరీ అయిన మెడిసిన్ అని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. అసెంబ్లీ సమవేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై సెటైర్లు వేశారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ”ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుందన్నారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి.

టీఎస్ పీఎస్ సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై ప్రొసీజర్ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కసబ్ కు ఉరి కూడా.. ప్రొసీజర్ తోనే జరిగింది. భవిష్యత్తులో నిరుద్యోగులు ఇబ్బందులు పడకూడదు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన తీర్మానం ఉంటుంది. అవసరం అనుకుంటే సభా సమావేశాలను స్పీకర్ పొడిగించవచ్చు. Krmb కి ప్రాజెక్ట్ లను గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించింది. సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథపైనా విచారణకు ఆదేశించామన్నారు. కేసీఆర్‌, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close