ఫుడ్ ఆంటీని వైసీపీ రోడ్డున పడేస్తే రేవంత్ ఆదుకున్నారు !

సోషల్ మీడియాలో ఎవరైనా కాస్త ట్రెండింగ్ అవుతున్నారంటే చాలు వారి దగ్గరకు పోయి జగన్ రెడ్డి గురించి ఏదో ఒకటి చెప్పి ప్రచారం చేసుకునే వైసీపీ సోషల్ మీడియా ఫేక్ బ్యాచ్ దెబ్బకు.. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రోడ్ పక్కన మీల్స్ అమ్ముకునే కుమారి అంటీ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. పదమూడేళ్లుగా హైదరాబాద్ లో బతుకుతున్న ఆమెకు.. జగన్ రెడ్డి సెంట్ స్థలం ఇచ్చారంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. అప్పటికే ఆమెకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కి రావడంతో ఈ పని చేశారు. తర్వాత పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ నడుపుతున్న ప్రాంతంలో పోలీసులు వారం రోజుల పాటు స్టాల్ పెట్టవద్దని ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోందని స్పష్టం చేశారు.

ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ నేతలు ఇదేదో రేవంత్ రెడ్డి చేయించారన్నట్లుగా ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పునః పరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఫుడ్‌ స్టాల్‌ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కుమారి పాత స్థలం లోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చునని సూచించారు. తాను స్వయంగా త్వరలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తం అవతోంది. ప్రజా పాలన అంటే ఇదేనని అంటున్నారు. జగన్ రెడ్డి పాలన దెబ్బకు అందరూ పక్క రాష్ట్రాలకు పరారయి బతుకుతూంటే వారి జీవితాలనూ తన ప్రచార పిచ్చి కోసం రోడ్డున పడేస్తోంది వైసీపీ. రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో పేదలకు అండగా ఉంటారు కాబట్టి సరిపోయింది. లేకపోతే సమస్య అయ్యేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close